ఇంద్రకిలాద్రిపై అమ్మ వారిని దర్శించుకున్న మెగా డైరెక్టర్ అనిల్ రావిపూడి..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కాగా ఈరోజు మహా విష్ణువును వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనే లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ ఆలయాలు శోభతో వెలిగిపోతుండగా.. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ప్రముఖ ఆలయాలకు క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకర వర ప్రసాద్" చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ మేరకు ఆలయ అధికారులు అనిల్ రావిపూడికి ఘనస్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా.. అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

కాగా దర్శనం అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన సాంగ్.. వారి కాంబినేషన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని స్పష్టం చేశారు.
మరోవైపు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. గుంటూరులోని కాలేజీలో ఇవాళ సాయంత్రం ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. తన చదువుకున్న కాలేజీలో తాను తెరకెక్కించిన సినిమా సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఉందని తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకంటే అద్భుతంగా ఈ చిత్రంలో కనిపిస్తారన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో చిరంజీవితో చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ మార్క్ హ్యూమర్, చిరంజీవి స్టైల్ యాక్షన్, నయనతార గ్లామర్.. ఇలా అన్నీ కలిసి ఈ చిత్రం 2026లో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications