అఖండ 2.. బిగ్ లీక్ ఇచ్చిన బోయపాటి
హైదరాబాద్/అమరావతి: అఖండ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన బ్లాక్ బస్టర్ మూవీ. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్.. నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అఘోరాగా బాలయ్య కనిపించడం థ్రిల్‌కు గురి చేసింది.
అఖండ సినిమాకు సీక్వెల్ ఉండొచ్చంటూ గతంలోనే ప్రకటించారు దర్శకుడు బోయపాటి. మాటిస్తున్నా తల్లి. కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, క్షణంలో నీ ముందుంటాను.. ఆన అంటూ బాలయ్య పలికిన డైలాగ్.. ఈ సినిమా ముగింపు కూడా సీక్వెల్ ఉందనే సంకేతాలను ఇచ్చింది.

ఆ తరువాత అఖండ 2పై పెద్దగా వార్తలేవీ రాలేదు. అటు బాలకృష్ణ తన తరువాతి సినిమాలతో బిజీ అయ్యారు. అఖండ తరువాత బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డి. తాజాగా భగవంత్ కేసరిలో నటిస్తోన్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉంది సినిమా. అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. దీని తరువాత ఎన్బీకే 109 సెట్స్‌పైకి వెళ్తుంది.
అటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన తరువాతి అసైన్‌మెంట్లతో బిజీ అయ్యారు. అఖండ తరువాత దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం తెర మీదికి వచ్చారాయన. స్కంద సినిమాను తెరకెక్కించారు. రామ్ పోతినేని హీరో. అతని సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.

సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కాబోతోంది స్కంద. బోయపాటి మార్క్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందీ మూవీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో కొద్దిసేపటి కిందటే ముగిసింది. నందమూరి బాలయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో బిగ్ లీక్ ఇచ్చారు బోయపాటి శ్రీను. అఖండ 2 సినిమాను చేస్తోన్నానంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాననీ తెలిపారు. కొంత గ్యాప్ రావొచ్చేమో గానీ.. అఖండ 2 సినిమా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది బాలయ్య బాబు అభిమానుల్లో జోష్ నింపింది.












Click it and Unblock the Notifications