త్రివిక్రమ్ శ్రీనివాస్, రానాకు గుణశేఖర్ కౌంటర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారని, తాను హిరణ్య కశ్యప సినిమాలో నటించనున్నట్లు హాలీవుడ్ వేదికగా నటుడు రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రానా ప్రకటన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ మనసును బాగా గాయపరిచింది. మనం దేవుడి మీద కథను రాస్తూ.. మన పనులన్నింటినీ ఆ దేవుడు గమనిస్తూనే ఉంటాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. అనైతిక పనులు ఆ దేవుడే నైతికంగా సమాధానం చెబుతాడు అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ రానా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కౌంటర్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. గుణశేఖర్ దాదాపు ఐదారేళ్ల నుంచి హిరణ్య కశ్యప ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్టఉ అని చెబుతుండేవారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేశారు. కరోనాకు ముందే ఈ సినిమాను ప్రారంభించాలనుకున్నప్పటికీ కొవిడ్ వల్ల వాయిదా పడింది.

అంతలో శాకుంతలం వచ్చి చేరడంతో దీన్ని పక్కనపెట్టి శాకుంతలాన్ని తీశారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. సమంత స్టార్ డమ్ ఒక్కసారిగా పడిపోయింది. తాజాగా రానా ప్రకటనతో గుణశేఖర్ షాక్ కు గురైనట్లున్నాడు. సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్నది కావడంతో సమయం అనుకూలించినప్పుడు తెరకెక్కిద్దామని గుణశేఖర్ భావించినట్లున్నారు. అయితే శాకుంతలం ఫ్లాప్ అవడం దిల్ రాజును నిండా ముంచింది. గుణశేఖర్ భవిష్యత్తు ప్రాజెక్టులమీద శాకుంతలం ప్రభావం పడింది.
హిరణ్య కశ్యప ప్రాజెక్టును గుణశేఖర్ అయితే సరిగా హ్యాండిల్ చేయలేడనే ఉద్దేశంతోనే రానా త్రివిక్రమ్ పై దృష్టిసారించినట్లున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. దర్శకుడు ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే గుణశేఖర్ దీన్ని వదిలేసుకున్నట్లేనని భావిస్తున్నారు. మీరు మంచి కమర్షియల్ హిట్ కొట్టి చూపండి.. నిర్మాతలు మీ దగ్గరకే వస్తారంటూ నెటిజన్లు సలహాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications