• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిగా మీకు..మీ డ్రైవర్‌కు తేడా లేదా: అలా చేస్తే-ఏపీ పేద రాష్ట్రం అవుతుంది: పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంలో ఎంట్రీ ఇవ్వడంతో మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల దాని ప్రభావం కలెక్షన్లపై చూపుతుందనే ఆందోళన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది.

Recommended Video

  AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
  ట్వీట్ల వార్‌ను మొదలు పెట్టిన ఆర్జీవీ

  ట్వీట్ల వార్‌ను మొదలు పెట్టిన ఆర్జీవీ

  ఈ పరిస్థితుల మధ్య దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధించారు. పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు సంధించారాయన. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. సినిమా టికెట్ల నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం- తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి రాజీ ఫార్ములాతో ముందుకొచ్చారాయన.

   పేర్ని నాని బదులిచ్చిన కొద్దిసేపటికే..

  పేర్ని నాని బదులిచ్చిన కొద్దిసేపటికే..

  సినిమా టికెట్ల విషయంలో తనకు కొన్ని సందేహాలు ఉన్నాయంటూ ఈ ఉదయం మంత్రి పేర్నినాని.. రామ్‌గోపాల్ వర్మకు కొన్ని ప్రశ్నలను వేశారు. 100 రూపాయలు ఉన్న ఓ సినిమా టికెట్‌ను 1000 రూపాయలు, 2000 రూపాయలకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ ప్రశ్నాస్త్రాలను సంధించారు.

  ఘాటుగా రిప్లై ఇచ్చిన ఆర్జీవీ..

  ఘాటుగా రిప్లై ఇచ్చిన ఆర్జీవీ..

  పేర్ని నాని అడిగిన ప్రశ్నలన్నింటికీ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ట్వీట్ల వార్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు.. ముదిరేలా చేశారు. థ్యాంక్యూ నాని గారు.. అంటూ మొదలు పెట్టిన ఆయన వరుస ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తనకు ఉన్న పరిజ్ఞాన్నంతా ఇందులో కనపరిచారు. సినిమా-మార్కెట్-పరిశ్రమలు.. వీటి చుట్టూ తిప్పారు. సినిమా టికెట్ల రేట్లను నిర్ధారించే హక్కు, అధికారం ప్రభుత్వానికి లేదంటూ కుండబద్దలు కొట్టారు.

  డిగ్నిటీగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూనే..

  డిగ్నిటీగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూనే..


  చాలామంది నాయకుల్లా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు రామ్ గోపాల్ వర్మ పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు. 100 రూపాయల టికెట్‌ను 1000 రూపాయలకు అమ్ముకోవచ్చా అంటూ వేసిన ప్రశ్నలో అర్థం లేదని అన్నారు. ధర అనేది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుందని పేర్కొన్నారు. నీళ్లు దొరకలేనప్పుడు గ్లాస్ నీళ్లను అయిదు లక్షల రూపాయలకు కూడా కొనవచ్చని అన్నారు.

  మార్కెట్ అంటే అదే..

  మార్కెట్ అంటే అదే..

  ఆ పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దాని కోసమేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు. కారు కావాలనే కోరికని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారని వ్యాఖ్యానించారు. తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్లమని ఎదురుదాడి చేశారు. ముడి పదార్థంగా చూస్తే 500 రూపాయలు కూడా ఖర్చు అవ్వని పెయింటింగ్‌ను కొనేవాడుంటే అయిదు కోట్ల రూపాయలకు కూడా అమ్ముతారని చెప్పారు.

  బ్రాండ్.. ఐడియాకు ఎలా వెలకడతారు?

  బ్రాండ్.. ఐడియాకు ఎలా వెలకడతారు?


  ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్, ఐడియాకు ఎలా వెల కడతారని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుందని, ఇంకా బెటర్‌గా ఉండేలా ప్రయత్నించడమేనని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అది ఇంకా బెటరా? కాదా? అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చారు. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరమని పేర్కొన్నారు.

  బ్లాక్ మార్కెట్ చేయడం క్రైమ్ కావొచ్చు గానీ.

  బ్లాక్ మార్కెట్ చేయడం క్రైమ్ కావొచ్చు గానీ.

  బ్లాక్ మార్కెటింగ్ అనేది ప్రభుత్వానికి తెలియకుండా చేసే క్రైమ్ అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అదే బ్లాక్ మార్కెటింగ్‌ను ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని పేర్ని నానిని నిలదీశారు. ముంబై, ఢిల్లీల్లో వారాన్ని బట్టి, థియేటర్‌ను బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ధరలను నిర్ధారిస్తారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ టికెట్ ధర 75 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకూ ఉంటాయని అన్నారు. వీటన్నింటినీ నియంత్రించేది ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై అని గుర్తు చేశారు.

  ప్రభుత్వ జోక్యం అనేది..

  ప్రభుత్వ జోక్యం అనేది..

  ప్రభుత్వం జోక్యం అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో మాత్రమే ఉంటుందని ఆర్జీవీ అన్నారు. బియ్యం, గోధుమల్లాంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తి ఎక్కువయిపోయి.. ధర పడిపోయినప్పుడు లేదా ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉంటుందని అన్నారు. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్టరీ లో కానీ, ప్రేక్షకుల్లో కానీ ఎక్కడ వచ్చిందండీ? అంటూ పేర్నినానిని ప్రశ్నించారు.

   లూటీ అనే పదం సరికాదంటూ..

  లూటీ అనే పదం సరికాదంటూ..


  బలవంతంగా లాక్కోవడం లూటీ అవుతుందని, ఇక్కడ దానికి ఆ అవకాశం లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారని గుర్తు చేశారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు.. ప్రభుత్వానికి రావాల్సిన వాటా పన్నుల రూపంలో తానంతట తానే వస్తుందని హామీ ఇచ్చారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని ఏ ప్రజలు చెప్పారు? వాళ్ల పేర్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

  రాజ్యాంగంలో గానీ.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో గానీ ఉందా?

  రాజ్యాంగంలో గానీ.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో గానీ ఉందా?

  థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అనే పదం రాజ్యాంగంలో గానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో గానీ ఉందా అని నిలదీశారు. దీనికి డెఫినిషన్ ఉందా? అని అడిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి ప్రభుత్వమే డెఫినిషన్ ఇచ్చుకుందని అన్నారు. థియేటర్లనేవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు.. అని స్పష్టం చేశారు. కావాలంటే ప్రభుత్వంలో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అని ఎద్దేవా చేశారు.

  మంత్రి అవ్వాలని అందరికీ ఉంటుంది..

  మంత్రి అవ్వాలని అందరికీ ఉంటుంది..

  ప్రతి మనిషి కూడా తాను ఉన్న పొజిషన్ నుంచి పైకి ఎదగాలని కోరుకుంటాడని, మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడని చెప్పారు. సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరనేది తన ప్రధాన ప్రశ్నగా చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాకు- సంపూర్ణేష్ బాబు సినిమాకి తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా?.. అంటూ సూటిగా ప్రశ్నించారు. పేదలను ధనికులను చేయడానికి ప్రభుత్వం పని చేయాలే తప్ప..ధనికులను పేదలుగా చేయకూడదని, అలా చేస్తే ఏపీ.. దేశంలోకెలా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

  English summary
  Director Ram Gopal Varma gave replies to the AP Minister Perni Nani on the Movie tickets issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X