చికోటి ప్రవీణ్ ను కలిసిన రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చికోటి ప్రవీణ్ ను కలిశారు. కడ్తల్ దగ్గర సాయిరెడ్డిగూడలోని ప్రవీణ్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. సినీ పరిశ్రమకు చెందినవారితో, రాజకీయ నేతలతో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రవీణ్ ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన క్యాసినో, మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ దర్యాప్తును ఎదుర్కొన్నారు. చికోటి ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులను చూశానని, ఇక్కడ ఉన్నవి తనను ఎంతో ఆకర్షించాయని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని రాసుకొచ్చారు. వర్మ నిజ జీవిత సంఘటనలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుకూలంగా ఎన్నికల్లో ఉపయోగపడటానికి రెండు సినిమాలకు తీయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వర్మ వాటిని ఖండించలేదు. టీడీపీ నేతలకు కౌంటర్ ఇస్తూ తీస్తున్నానని ప్రకటించారు.
చికోటి ప్రవీణ్ ను వర్మ కలవడంపై పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. చికోటి చీకటి జీవితంపై సినిమాల తీయాలనే ఉద్దేశంతో వర్మ ఫామ్ హౌస్ కు వెళ్లారని, త్వరలోనే ఆయన ప్రకటన చేస్తారంటూ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన రామ్ గోపాల్ వర్మ కచ్చితంగా ప్రవీణ్ పై సినిమా తీయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై వర్మ స్పందించలేదు. కేవలం అక్కడి జంతువులను చూడటానికే వెళ్లానని, తనకు బాగా నచ్చిందని, సినిమా తీసే ప్రయత్నం ఉంటే మీకు తెలియజేస్తానని మీడియాకు చెప్పారు. చికోటి ప్రవీణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన రాజకీయ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి













Click it and Unblock the Notifications