
సినిమా టికెట్లపై మీ పెత్తనమేంటి ?.. జగన్‌ది ముమ్మాటికీ తప్పే.. రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధర తగ్గింపు వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్న తీరుగా నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. టికెట్ ధరను తగ్గించడం ముమ్మాటికీ తప్పేనన్నారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తి దారుడికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వానిది తప్పే..
ఏదైనా ఓ వస్తువును ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తే దాని ఎమ్మెర్పీ నిర్ణయించే అధికారం వారికే ఉంటుందన్నారు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. దానిని కొనాలా..? వద్దా? అనేది వినియోగదారుడు ఇష్టమన్నారు. అదే విధంగా సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించుకుంటే తప్పేమీలేదంటూ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. వస్తువును వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తాయి. కానీ అందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉందన్నారు. సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడమేంటో అర్థం కావడంలేదని విమర్శించారు.

టికెట్ ధర తగ్గిస్తే నిర్మాతలకు కష్టం
ప్రేక్షకుడు ఒక సినిమాని చూడాలనుకుంటే టికెట్ ధర ఎంత ఉన్నా కొని చూస్తారు.. లేదా మానేస్తారు... అది వారి ఇష్టం అన్నారు వర్మ. సాధారణ కారు ధరకు బెంజ్ కారు కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఒక సినిమాను నిర్మించాలంటే దాని వ్యయం కథ, నటీనటులు, సాంకేతికతను బట్టి పెరుగుతుంది.. తగ్గుతుంది అన్నారు. టికెట్ ధరలు తగ్గిస్తే నిర్మాతలకు కష్టమన్నారు. వారు పెట్టిన ఖర్చులు కూడా రావని పేర్కొన్నారు.

సినీపరిశ్రమపై ఎందుకీ కక్ష?
హీరోల రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాడమనేది సాధ్యమైయ్యే పనికాదన్నారు రామ్ గోపాల్ వర్మ. నిర్మాణ వ్యయం తగ్గించాలంటే దాని ప్రభావం సిబ్బందిపై అభిప్రాయం పడ్డారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం ద్వారా జగన్ ప్రభుత్వం కావాలనే సినిమా పరిశ్రమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందా ? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సినమాలు తీయడానికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందా.. లేదు కదా.. మరి అలాంటప్పుడు ప్రైవేటుపై ప్రభుత్వ అజమాయిషీ ఎలా ఉంటుందని ప్రశ్నిచారు.

టాలీవుడ్ గట్టిగా అడగలేకపోతున్నారు..
టికెట్ల వ్యవహారం టాలీవుడ్, ఏపీ సర్కార్ చిన్న పిల్లలాగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై సినీ పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేయడంలేదన్నారు. అందుకుకే ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. డిమాండ్ చేయాలనుకున్నప్పుడు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రశ్నించాలన్నారు. టికెట్ల ధర విషయంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం లేదన్నారు.