పోలీస్ ఎంక్వైరీకి హాజరైన డైరెక్టర్ ఆర్జీవీ.. వర్మను కలిసిన వైసీపీ నేతలు

సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో కేసు నమోదు నమోదు అయిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా గా టాపిక్ గా మారిన ఈ ఇష్యూలో ఈరోజు.. కోర్టు ఆదేశాల మేరకు వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు లాయర్‌తో కలిసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఒంగోలు రూరల్ డీఎస్పీ,సీఐ శ్రీకాంత్ వర్మను విచారిస్తుండగా.. ఆయన కోసం అధికారులు 50 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుండగా .. ఇప్పటి వరకు ఆర్జీవీ ఎలాంటి సమాధానం చెప్పలేదని సమాచారం.

ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆయనపై మద్దిపాడు మండల టీడీపీ నేత ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.

Director RGV attended police enquiry in ongole

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను వేరే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నానని.. వేరొక రోజు వస్తానని వాట్సప్‌ ద్వారా మెసేజ్ చేశారు. అయితే పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరు కావడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దాంతో పోలీసులు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వర్మకు బెయిల్‌ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఒంగోలు రూరల్‌ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో నేడు వర్మ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరయ్యే ముందు ఆర్జీవీని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్‌ వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. చెవిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+