ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ - ఆర్జీవీ..!!

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ చంద్రబాబు పక్కన కూర్చుని ఎన్టీఆర్‌ను ఇవాళ పొగడటం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమేనని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని ప్రశంసించారు. సంబంధం లేకపోయినా గౌరవంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్మీ పార్వతి అభినందించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ గా మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ఆర్జీవి కీలక వ్యాఖ్యలు: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ రోజు ఒక జోక్ జరుగుతోందని చెప్పిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారని వివరించారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా అని ప్రశ్నించారు. అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారని ఆర్జీవీ నిలదీసారు. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని..వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడ్డారంటూ ఆర్జీవి ప్రశంసించారు. ఈ శతాబ్దం ఎన్టీఆర్ దేనని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

RGV

వారసులు ఎలా అవుతారు: ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికి అర్హత లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు కానీ, చంద్రబాబు వైపు వెళ్ళకండని పోసాని క్రిష్ణ మురళీ పేర్కొన్నారు. చంద్రబాబు లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వ హననం చేశారంటూ వ్యాఖ్యానించారు. మూడు సార్లు గుండె పోటు వస్తే ఎన్టీఆర్ ను ప్రాణంలా చూసుకున్నారని లక్ష్మీపార్వతి గురించి వివరించారు.

ఎన్టీఆర్ బ్రాండ్: రెండు రూపాయలకు కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ అని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని నివాళి అర్పించారు. మున్సబ్‌గిరి, కరణంగిరి రద్దు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని వివరించారు. ఎన్టీఆర్ అమాయకుడు, ఆవేశపరుడు, పేదల మనిషిగా అభివర్ణించారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో దండం పెట్టించుకునే దౌర్భాగ్యం ఎన్టీఆర్ దని వ్యాఖ్యానించారు. 11 మంది పిల్లలు ఉన్నా...అవసాన దశలో ఒక్కరు కూడా ముద్ద అన్నం పెట్టలేదంటూ పేర్ని నాని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+