పవన్ కల్యాణ్ కు సెంటిమెంట్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్?

మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ప్రజలపై బలమైన ముద్ర వేశారు. తన దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాలను అందించే త్రివిక్రమ్ అంటే దర్శకుడిగానే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అందుకు తగ్గట్లుగానే తన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను కూడా వాయిదా వేసి పవన్ కల్యాణ్ చేసే సినిమాల ప్రాజెక్టులను సెట్ చేసే బాధ్యత తీసుకుంటారు.

తాను దర్శకత్వం చేయకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతోంది అంటే అందులో కథానాయికగా ఎవరుండాలి? దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? కథలో ఎటువంటి మార్పులు చేయాలి? ఏ తరహాలో మాటలు అందించాలి? బడ్జెట్ ఎంతవుతుంది?... ఇలా అన్నిరకాలుగా ప్రాజెక్టులో త్రివిక్రమ్ ఇన్ వాల్వ్ అవుతారు. ఆయన జోక్యం చేసుకొని ప్రాజెక్ట్ ను సెట్ చేశారంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఒకరకంగా ఆయనకు ఇది సెంటిమెంట్ గా మారిపోయింది.

pawankalyantrivikramsrinivas1

తాను దర్శకత్వం చేసే సినిమాలకు పారితోషికంతోపాటు లాభాల్లో వాటాలు తీసుకునే త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ సినిమాలకు మాటలు, కథ, స్క్రీన్ ప్లే అందించినందుకు ఆయా సంస్థల నుంచి కూడా రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భీమ్లానాయక్ కానీ, త్వరలో విడుదల కాబోతున్న బ్రో సినిమాకానీ, ఆ తర్వాత పవన్ కల్యాణ్ చేసే ఏ సినిమా అయినా తన పారితోషికంగా త్రివిక్రమ్ కొంత తీసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ తో మంచి స్నేహం ఉండటంతోపాటు సినిమా నిర్మాణంపై పట్టు ఉండటంతో త్రివిక్రమ్ ను ఎవరూ కాదనలేని పరిస్థితి. కొన్ని సినిమాలకు డైరెక్టర్లు వేరేనా అది టైటిల్స్ వరకే పరిమితమవుతుందని, మొత్తం అన్ని బాధ్యతలు త్రివిక్రమే చూస్తారని చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కల్యాణ్ తో ఉన్న స్నేహం వల్ల త్రివిక్రమ్ కు బాగానే గిట్టుబాటవుతోందని ఫిల్మ్ నగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+