మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి... ఐదుగురు మృతి
దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజాము నుంచే ప్రజలు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ శివయ్యని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శివ నామస్మరణతో ఆలయాలు అన్నీ మార్మోగుతున్నాయి. అయితే మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఈ విషాద ఘటన జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లారు ఐదుగురు యువకులు. అయితే లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారంతా మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఐదుగురు మృతదేహలు లభ్యమయ్యాయి.

మృతి చెందిన యువకులు తాడిపూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. యువకులను తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనీసెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిగా తెలిపారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించక మునిగిపోయారని అనుకుంటున్నారు. ఒకరికి ఒకరు రక్షించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఐదుగురు యువకులు గల్లంతు అయినట్టుగా అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications