చేపమందు: సాగిందిలా, భారీ జనం, తోపులాట(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారంనాడు చేప ప్రసాదం కోసం ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదాన్ని ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకులతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది.
మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం లైన్లలో వేచివున్నారు. తమవంతు వచ్చిన వారు చేప ప్రసాదం స్వీకరించి అక్కడ్నుంచి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, మధ్యమ మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిహెచ్ఎంసి, విద్యుత్, జలమండలి, డిఎంహెచ్‌ఓ, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
మత్స్య శాఖ చేపమందు పంపిణీ కోసం లక్ష కొరమీను చేపపిల్లలను అందచేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 32 కౌంటర్లలో ఒక్కొక్క చేప పిల్లను రూ.15లకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు విక్రయించారు. ఆదివారం సాయంత్రం 9.00 గంటలకు 20 వేల చేప పిల్లలను అమ్మినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు. ప్రజలు బస చేసేందుకు మైదానంలో ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేశారు.

చేప ప్రసాదం
చేప ప్రసాదం కోసం భారీగా జనం రావడంతో కొంత తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని క్యూలైన్లలో నడిచే విధంగా చూశారు. తోపులాటలో కిందపడిపోయిన ఓ మహిళ.

తోపులాట
ఆదివారంనాడు చేప ప్రసాదం కోసం ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది.

తోపులాట
ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదాన్ని ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించారు.

భారీ జనం, తోపులాట
మొదట బత్తిని కుటుంబ సభ్యులు వారి పూర్వీకులకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పాల్గొన్నారు.

భారీ జనం, తోపులాట
చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకులతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది.

భారీ జనం, తోపులాట
మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం కోసం లైన్లలో వేచివున్నారు.

చేప ప్రసాదం
తమవంతు వచ్చిన వారు చేప ప్రసాదం స్వీకరించి అక్కడ్నుంచి తమ స్వస్థలాలకు పయనమయ్యారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

చేప ప్రసాదం
కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, మధ్యమ మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కిందపడి పోయిన మహిళకు నీళ్లు తాగిస్తూ..
జిహెచ్ఎంసి, విద్యుత్, జలమండలి, డిఎంహెచ్‌ఓ, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

చేప ప్రసాదం
మత్స్య శాఖ చేపమందు పంపిణీ కోసం లక్ష కొరమీను చేపపిల్లలను అందచేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 32 కౌంటర్లలో ఒక్కొక్క చేప పిల్లను రూ.15లకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు విక్రయించారు

చేప ప్రసాదం
ఆదివారం సాయంత్రం 9.00 గంటలకు 20 వేల చేప పిల్లలను అమ్మినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు.

చేప ప్రసాదం
ప్రజలు బస చేసేందుకు మైదానంలో ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకుని ఈ షెడ్ల కింద సేదతీరారు.

చేప ప్రసాదం
ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం 5.30 గంటల వరకు కొనసాగునుందని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం అందని వారికి నగరంలోని కవాడిగూడలోని తమ నివాసంలో మంగళవారం చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు.
ఢిల్లీతోపాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకుని ఈ షెడ్ల కింద సేదతీరారు. వీరి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయాలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. చేప ప్రసాదం పంపిణీకి వేదికగా నిలిచిన ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం మొదటి రోజు 500మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లను మధ్య మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి, ఏసిపి జైపాల్ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. కాగా, భారీగా వ్యాధిగ్రస్థులు రావడంతో కొంత తోపులాట జరిగింది. పోలీసులు సరిగా స్పందించడంతో చేప ప్రసాదం పంపిణీ సాఫీగా సాగింది.
ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం 5.30 గంటల వరకు కొనసాగునుందని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. ఈ పంపిణీలో లక్షలాది మంది ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిరుడు 2 లక్షల మందికి పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది మరో లక్షకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చేప ప్రసాదం అందని వారికి నగరంలోని కవాడిగూడలోని తమ నివాసంలో మంగళవారం చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. కాగా, చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన కొద్ది సమయానికి బత్తిని హరినాథ్‌గౌడ్‌కు స్వల్ప అస్వస్థత చేకూరింది. దీంతో ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications