వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఅసెంబ్లీలో విభజన రగడ, జరిగిందేదో జరిగింది: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజన చేస్తే తెలుగుదేశం పార్టీ వంత పాడిందని అయనా, జరిగిందేదో జరిగిపోయిందని, దాని గురించి ఆలోచించడం మానేద్దామని, ఇక నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన దృష్టి సారించుదామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సోమవారం ఎపి అసెంబ్లీలో అన్నారు. సాఫ్టువేర్ రంగం పైన దృష్టి సారిస్తే తెలంగాణ కంటే ఎపి ముందుకు దూసుకు పోతుందన్నారు.

మనకు అనేక పోర్టులు ఉన్నాయని, విమానాశ్రయాలు ఉన్నాయని, గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ సముద్ర తీరం ఉందని, వీటిని ఉపయోగించుకుంటే అభివృద్ధిలో దూసుకు పోవచ్చునని చెప్పారు. సాఫ్టువేర్ సంస్థలు గుజరాత్‌తో పాటు ఎపిలోను చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవన్నారు. దానిపై దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. మనం బలాలను మనం గుర్తుంచుకొని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

Division issue in Andhra Pradesh Assembly

చంద్రబాబు హయాంలో ఏటా రెవెన్యూ లోటు ఏర్పడిందని చెప్పారు. చంద్రబాబుకు ముందు రూ.22వేల కోట్ల రెవెన్యూ సర్ ప్లస్ ఉందన్నారు. బాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకం లేదన్నారు. చంద్రబాబు తన హయాంలో మద్యం నిషేదాన్ని ఎత్తివేశారని, రూ.2 కిలో బియ్యాన్ని రూ.5 గా చేశారన్నారు. విద్యుత్ బిల్లులు కూడా భారీగా పెరిగాయన్నారు. బాబు హయాంలో ధరలతో పాటు రెవెన్యూ లోటు పెరిగిందన్నారు.

జగన్ ప్రసంగంపై ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు ముందు ఎపి బ్రహ్మాండంగా ఉందని జగన్ చెప్పడం ద్వారా.. లాలూచీ పడ్డారనే దానికి ఫలితం కనిపిస్తుందని యనమల అన్నారు. విభజన తర్వాత ఎపి లోటు బడ్జెట్‌లోకి వెళ్లిందని వివరణ ఇచ్చారు.

యనమల వివరణపై జగన్ స్పందిస్తూ... విడగొట్టింది వారు, సహకరించింది వారు, రాజకీయం చేస్తోంది వారని జగన్ అన్నారు. తన ప్రశ్న పూర్తికాకముందే వారు సమాధానం ఎలా చెబుతారన్నారు.

English summary
Andhra Pradesh state Division issue in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X