అసెంబ్లీనుండే స్టార్ట్ కావాలి: టిపై ఉండవల్లి, ఢిల్లీకి కౌంటర్

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆర్టికల్ 3 విషయంలో రాష్ట్రపతిది కీలక పాత్ర అని, రాజ్యాంగ స్ఫూర్తితోనే విభజన జరగాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఆర్టికల్ 3 పైన రాజ్యసభలో జరిగిన చర్చ పైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ తాను లేఖ రాశానని చెప్పారు.

విభజన జరగాలంటే ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ నుండి ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే విభజన జరగాలన్నారు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు రాజ్యాంగ స్ఫూర్తితోనే ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలని నాడు కెటి సాగర్ చెప్పారని గుర్తు చేశారు.

మద్రాసు అసెంబ్లీ తీర్మానం తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగాలంటే అసెంబ్లీ నుండి విభజన ప్రక్రియ ప్రారంభం కావాల్సిందే అన్నారు. ప్రజలకు అభ్యంతరం లేనప్పుడు విభజన జరగాలని గతంలో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారన్నారు.

దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదన్నారు. రాష్ట్రపతి నిర్ణయం తర్వాత కూడా పార్లమెంటులో బిల్లు మొత్తం మారవచ్చునన్నారు. హైదరాబాదు ప్రజలు రాష్ట్రం ఏర్పాటు చేయాలని అడిగితే ఇస్తారా అని ప్రశ్నించారు. అలా అడిగితే దేశంలో ఉపద్రవాలు వస్తాయన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అని, ఆయన విభజన జరిగితే వస్తే నష్టాలను లేఖ ద్వారా వెల్లడించారన్నారు. ఆయన ఏ ఒక్క ప్రాంతానికే సిఎం కాదన్నారు. అందుకే సమైక్యమంటున్నారని అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ ఏర్పాటులో అసెంబ్లీ తీర్మానం ఉండాలని నాడు బిజెపి చెప్పిందన్నారు.

పిసి చాకోకు కౌంటర్!

తాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ తన సంతృప్తి కోసమే రాశానని, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు మాత్రమే రాశానని ఉండవల్లి చెప్పారు. అంతేకానీ ఆయనకు తెలియదని తాను రాయలేదన్నారు. ఆయన మేథావి అని, రాజకీయవేత్త అని, అనుభవజ్ఞుడన్నారు. ప్రణబ్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు మాత్రమే తాను ఆర్టికల్ 3 పైన లేఖ రాశానని, ఆయనకు తెలియదని కాదన్నారు.

రేపు ఎవరో వచ్చి ఉండవల్లికి తెలిసినంత రాజ్యాంగం రాష్ట్రపతికి తెలియదా అని మాట్లాడతారనే తాను ముందే వివరణ ఇస్తున్నానని చెప్పారు. కాగా, ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు ఇటీవల ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పిసి చాకో స్పందిస్తూ.. ప్రధాని, రాష్ట్రపతిలకు కిరణ్ కంటే ఎక్కువగా రాజ్యాంగం తెలుసునని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+