దివ్వెల మాధురికి తిరుమల కలిసిరాలేదబ్బా.. ఫోటోషూట్ కేసు విచారణకు వెళ్తే ఇంకో కేసు!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట పేరు వివాదాలకు. కేరాఫ్. ముఖ్యంగా ఈ జంట తిరుమలలో ఇప్పటికి రెండు వివాదాలలో చిక్కుకున్నారు. 2024లో రీల్స్, ఫోటోషూట్‌ల కేసు ఇంకా విచారణలో ఉండగానే, తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను కొండపై నిర్వహించి ఈ జంట మరో తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. ఈ వరుస సంఘటనలు వారికి అనవసరమైన చిరాకులను తెచ్చి పెడుతుంది. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తిరుమల ఫోటోషూట్ కేసులో కోర్టుకు దివ్వెల మాధురి
తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుని, నేడు 2024లో తిరుమలలో ఫోటోషూట్‌లు, రీల్స్ చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజ మొన్న బుధవారం నాడు తిరుమలకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి, మాధురి, తనూజలు తిరుమలలోని ఓ గెస్ట్‌హౌస్‌లో తనూజ పుట్టినరోజు వేడుకలు జరిపారు.

తనూజ పుట్టినరోజు కేక్ కట్ చేసిన వివాదం
ఆ తర్వాత దివ్వెల మాధురి ఆ వేడుకల వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, తిరుమల కొండపై కేక్ కట్ చేయటం నిషేధం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై టీటీడీ అధికారులు సీరియస్‌గా స్పందించారు. తిరుమల కొండపై బర్త్‌డే వేడుకలు చేసుకోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.
మరో కేసులో ఇరుక్కున్న దివ్వెల మాధురి
వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. గతంలో 2024లో తిరుమలలో ఫోటోషూట్‌లు, రీల్స్ చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరు కావటానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇప్పుడు మళ్ళీ మరో కేసులో చిక్కుకున్నారు.
కోర్టులో కేసు విచారణకు హాజరైన దివ్వెల మాధురి
ఇక నేడు 2024లో ఫొటో షూట్ లు, రీల్స్ చేసిన కేసులో ఆమె , దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు ఎదుట హాజరయ్యారు. తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను కోర్టు దివ్వెల మాధురికి అందజేసింది. మే 12న ఇద్దరు జామీనుదారులతో పాటు జామీను పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
తిరుమల కలిసిరాలేదన్న అభిప్రాయం
మాధురి తరఫున న్యాయవాది ఇరుగు రమేష్ కోర్టులో వాదనలను వినిపిస్తున్నారు. ఒక కేసు విచారణలో ఉండగానే, పుట్టినరోజు వేడుకల ఘటనలో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉండటంతో, దివ్వెల మాధురి న్యాయపరమైన సవాళ్లపై అందరిలో చర్చ జరుగుతుంది. అదనపు కేసుల నమోదు జరిగితే పరిస్థితి ఏంటన్న ఆసక్తి నెలకొంది. తిరుమల అచ్చి రాలేదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications