తిరుమలలో మరో వివాదంలో దివ్వెల మాధురి, తనూజ.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు!
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజలు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించారన్న ఆరోపణలతో వీరిపైన తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల పవిత్రతను ఉల్లంఘించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి.
తిరుమలలో తనూజ పుట్టినరోజు వేడుకలు చేసిన దివ్వెల మాధురి
శ్రీవారి సన్నిధిలో బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి వేడుకలను నిర్వహించుకున్నారు.ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను దివ్వెల మాదిరి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి కొండ చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కొండలపైన కేక్ తీసుకు వెళ్లడం నిషేధం.

తిరుమలలో వ్యక్తిగత వేడుకలపై నిషేధం
నిషేధం ఉన్నప్పటికీ కొండపైకి కేక్ తీసుకువెళ్లి తనూజ తో కేక్ కట్ చేయించిన వీడియోను దివ్వెల మాధురి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో ఇది తిరుమల పవిత్రతకు భంగం అన్న అభిప్రాయం భక్తుల నుండి వ్యక్తమవుతుంది. దివ్వెల మాధురి, తనూజ తాము బస చేసిన గెస్ట్ హౌస్ లో ఈ వేడుకలను జరుపుకున్నారు. తిరుమలలో వ్యక్తిగత వేడుకలు జరుపుకోవడం పైన నిషేధం ఉంది.
నిబంధనలు పట్టించుకోకుండా జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేయడానికి అనుమతి లేదు. అయితే ఈ నిబంధనలను వేటిని పట్టించుకోకుండా తనూజ బర్త్ డే వేడుకలు తిరుమల కొండపైన చేయడంపైన భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ దివ్వెల మాధురి షేర్ చేసిన వీడియో ఆధారంగా టిటిడి విజిలెన్స్ విభాగం స్పందించింది. కొండపైకి కేక్ ఎలా చేరింది అన్న అంశం పైన విచారణ మొదలుపెట్టింది.
శ్రీవారి సన్నిధిలో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి రీల్స్
ఇదిలా ఉంటే గతంలో కూడా దివ్వెల మాధురి వివాదాలలో చిక్కుకున్నారు. శ్రీవారి సన్నిధిలో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి రీల్స్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. తిరుమల యొక్క పవిత్రమైన ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించారని అప్పట్లో భక్తులు, టిటిడి అధికారులు కూడా ఆమె పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్లీ మరోమారు తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ప్రవర్తించడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
టిటిడి వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందాయని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది. ఇదిలా ఉంటే నిన్న ఉదయం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications