చంద్రబాబు - పవన్ పొత్తు : సీఎం ఆయనే - డీఎల్ కీలక వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనను ఎవరూ తీసేయలేదన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన ఆరోపణలు చేసారు. అవినీతి చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీలో ఉండాలంటే తనకే ఇబ్బందిగా ఉందని చెప్పారు. వైసీపీ ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నట్లు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన ఉంటుందని డీఎల్ అంచనా వేసారు. ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేవుడు వచ్చిన కాపాడలేడన్నారు. చంద్రబాబు సీఎం అయిన ప్రరయత్నం చేస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరో నేత ఎవరూ ఇప్పుడు కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని విశ్లేషించారు.

పవన్ కల్యాణ్ లో నిజాయితీ ఉన్న సీఎం అయ్యేందుకు అనుభవం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి విశ్లేషించారు. దీంతో, చంద్రబాబు - పవన్ కలిసే పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీలో ఇసుక, మట్టి, మద్యం అన్నీ అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. టీచర్లపై కక్షతో బైజూస్ ప్రవేశపెట్టి విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపణలు చేసారు.

DL Ravindra Reddy interesting comments on TDP and Janasena Alliance and YS Viveka Mruder case

వివేకా హత్య కేసుకు సంబంధించి డీఎల్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జనవరి 3 నుంచి వివేకా కేసులో మలుపులు తిరగనున్నాయన్నారు. వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని చెప్పుకొచ్చారు. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని గుర్తు చేసారు. సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేసారు.

అనేకమంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్నారు. వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనేది స్పష్టత ఇవ్వటం లేదు. ఆయన టీడీపీ - జనసేన వైపు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+