పవన్ కల్యాణ్ కు అనూహ్యమైన మద్దతు!
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని, అందుకు అవసరమైతే తాను తగ్గుతానని, అందరినీ కలుపుకు వెళతానని పదే పదే ప్రకటిస్తున్నారు జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్. తెలుగుదేశం పార్టీతో దాదాపుగా పొత్తు పెట్టుకొని వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో రాజకీయ దిగ్గజం నుంచి పవన్ కు నైతిక మద్దతు లభించింది.

అత్యంత నిజాయితీ పరుడు
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపించిన డీఎల్ రవీంద్రారెడ్డి పవన్ కల్యాణ్ ను అత్యంత నిజాయితీ పరుడిగా అభివర్ణించారు. ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉందని, అది ప్రతిరోజు అతడి నుంచి వ్యక్తమవుతూనే ఉంటుందని కొనియాడారు. పవన్ కల్యాణ్ అడుగు బయట పెట్టిన మరు క్షణం నుంచే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ గా విమర్శలు గుప్పిస్తారు. తెలుగుదేశం నుంచి ప్యాకేజీ తీసుకొని వారికి అనుగుణంగా రాజకీయం చేస్తున్నారని వైసీపీ మంత్రులు పదే పదే విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ప్యాకేజీలు తీసుకుంటే కనపడతాయిగా..
వాస్తవానికి అంత భారీ ప్యాకేజీలు తీసుకునే వ్యక్తి అయితే ఆస్తుల రూపంలో కానీ, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి కానీ పెట్టడం చేయాలని, కానీ తమ నేత ఇవన్నీ చేయడంలేదంటూ జనసేన సైనికులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీ స్టార్ గా పవన్ పై అవినీతి పరుడనే ముద్ర వేసి ప్రజల నుంచి దూరం చేయాలనుకోవడం వైసీపీ వల్ల కాదంటున్నారు. పవన్ కల్యాణ్ బయటకు రాబోతున్నారన్నంతనే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా వైసీపీ నేతలు పలువురు.. ఆయన్ను ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించటం.. అవాకులు చవాకులు పేలటం చూస్తునే ఉంటాం.

ఎవరి నోటినుంచి రాని నైతిక మద్దతు డీఎల్ నుంచి
టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద నుంచి భారీగా ప్యాకేజీ తీసుకొనట్లుగా అర్థం లేని ఆరోపణలు చేస్తుంటారు. నిజంగానే చంద్రబాబు దగ్గర అంత భారీగా ప్యాకేజీ తీసుకొని ఉంటే.. ఆ డబ్బుల్ని ఆస్తుల రూపంలోనో.. వ్యాపార రూపంలో ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెడతారు కదా? ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే.. ఈ పాటికి బయటకు రాకుండా ఉండేదా? వాస్తవానికి మూడున్నర సంవత్సరాల కాలంలో కనీసం ఏ చిన్న మార్గంలో కూడా తమ నేతకు సాయం అందలేదని, కేవలం ప్యాకేజీ స్టార్ అనేది దుష్ప్రచారమేనని జనసైనికులు మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచికానీ, బీజేపీ నేతల నుంచి కానీ, సొంత పార్టీ నేతల నుంచికానీ రాని ఒక నైతికమైన మద్దతు, ఒక సీనియర్ రాజకీయవేత్త, నిజాయితీపరుడైన నేత డీఎల్ రవీంద్రారెడ్డి నుంచి రావడం అరుదైన విషయంగానే చెప్పొచ్చంటున్నారు విశ్లేషకులు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications