చంద్రబాబు vs పెద్దిరెడ్డి, ఎందుకు అంత ?, ఈనాటి కథకాదు, ఇద్దరి మధ్య చాలానే ఉంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల మధ్య రాజకీయ వైరం ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడంతో దశాభ్దాల నుంచి నాయకులు ఇద్దరికీ రాజకీయంగా పోటీ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీ ఎక్కువ అయ్యింది

గతంలో చంద్రబాబు సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రిగా పని చేశారు. జగన్ వైఎస్ఆర్ సీపీని స్థాపించిన తరువాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి తరువాత ఆ పార్టీలో చేరిపోయారు. ఇక పీలేరు నుంచి పుంగనూరు నియోజక వర్గానికి మారిన పెద్దిరెడ్డి తరువాత వైసీపీలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. 2019లో జగన్ సీఎం కావడం, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రి కావడం జరిగింది.

Do you know why there is competition between Chandrababu and YCP leader Peddireddy
వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడిగా, మంత్రిగా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎక్కువగా కుప్పం మీద ఫోకస్ పెట్టడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలోనే కుప్పంను మునిసిపాలిటీగా చేశారు. కుప్పంలో మొదటిసారి జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చక్రం తిప్పి వైసీపీ ఖాతాలో వేసుకున్నారు. కుప్పంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు షాక్ అయ్యారు.

ఆ తరువాత కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని జగన్ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి శ్రద్ద చూపించారు. కుప్పంలో పర్యటించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో చంద్రబాబు రగిలిపోయారు. కుప్పంలో తనను దెబ్బ తియ్యడానికి పెద్దిరెడ్డి కుట్రలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుప్పం నియోజక వర్గంలో పర్యటించారు.

Do you know why there is competition between Chandrababu and YCP leader Peddireddy
ఇలా కుప్పం విషయంలో పెద్దిరెడ్డి ఎక్కువగా జోక్యం చేసుకోవడం చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో కుప్పం టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడంతో అప్పటి నుంచి చంద్రబాబు ఆయన మీద కసిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మదనపల్లె సమీపంలోని అంగళ్లు, పుంగనూరు బైపాస్ రోడ్డు సమీపంలో చంద్రబాబు పర్యటన సందర్బంగా గొడవలు జరగడం, చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు నమోదు కావడం తెలిసిందే.

పెద్దిరెడ్డి కావాలనే తన మీద కక్షతో తప్పుడు కేసులు పెట్టించారని, మావాళ్లను జైలుకు పంపించారని చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపించారు. మేము అదికారంలోకి వచ్చిన తరువాత అందరికి వడ్డతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు ఆరోజే చెప్పారు. చంద్రబాబు అనుకున్నట్లుగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం జరిగిపోయింది.

అధికారంలో ఉన్న సమయంలో మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన పెద్దిరెడ్డి మీద చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో వైసీపీ నాయకుడు, పెద్దాయన వ్యవహారం ఒక్కొక్కటి బయటకులాగుతున్నారు. 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన సమయం నుంచి చంద్రబాబుతో రాజకీయంగా వైర్యం ఉంది. అయితే చంద్రబాబుకు, పెద్దిరెడ్డి రాజకీయంగానే విభేదాలు ముదిరిపోవడంతో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+