రోజా మారటం లేదు: డొక్కా, జగన్ జీవితం ఓదార్పుకే: కేఈ

విజయవాడ: కోర్టులు చెప్పినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తీరు మారడం లేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నాడు మండిపడ్డారు. వైసిపి చర్యలతో ఏపీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు మంచివి కావని సూచించారు. రోజా అంతకుముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన నిప్పులు కురిపించిన విషయం తెలిసిందే.

Dokka Manikya Vara Prasad slams Roja

విశాఖలో ముద్రగడ

కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తారని భావిస్తున్నానని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ ప్రద్మనాభం గురువారం విశాఖలో అన్నారు. వైసిపి విశాఖ పట్టణ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్‌ను ముద్రగడ కలిశారు. రైల్వే జోన్‌కు ఆయన చేస్తున్న నిరసనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ జాతికి రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడతామన్నారు.

రాజకీయ జీవితమంతా ఓదార్పుకే: కేఈ

జగన్ రాజకీయ జీవితమంతా ఓదార్పుకేనని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. సభలో జగన్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారన్నారు. తప్పుడు పుస్తకాలు ముద్రించి, తమ మీడియాలో వేయడం విడ్డూరమన్నారు. జగన్ వైఖరితో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారన్నారు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు.

అమ్ముడుపోయే అవసరం లేదు: చాంద్ భాషా

రూ.పది కోట్లకు అమ్ముడుపోవాల్సిన అవసరం తనకు లేదని కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని చెప్పారు. టిడిపిలోకి వెళ్లే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని చెప్పడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+