ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
ఏపీ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఇక దీంతో ఆయన స్థానం ఆయనకే దక్కినట్టు అయ్యింది .
ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. అనూహ్యంగా ఈ రోజు ఉదయం ఆయన ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేశారు ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపధ్యంలో ఆయన రాజీనామా చేసిన స్థానానికి తిరిగి ఆయనకే అవకాశం ఇవ్వటంతో ఎవరూ పోటీ చెయ్యలేదు .ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టలేదు .

మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యత్వానికి వర్ల రామయ్యను రంగంలోకి దించి పరాభవం పాలైన టీడీపీ ఇప్పుడు ఈ స్థానానికి పోటీ చెయ్యలేదని తెలుస్తుంది .రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన డొక్కా నేడు మళ్ళీ ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక ద్వారా మండలిలో స్థానం సంపాదించి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగియటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది .












Click it and Unblock the Notifications