15న టిడిపిలోకి డొక్కా! రాయపాటి రాయబారం, చంద్రబాబు ఓకే
గుంటూరు: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ నెల 15వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.
డొక్కా పార్టీలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు ఎంపీ రాయపాటి సాంబశివ రావు వివరించినట్లుగా తెలుస్తోంది. డొక్కాను చేర్చుకునేందుకు సిఎం చంద్రబాబు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాక డొక్కా కొద్ది రోజులు తన రాజకీయ భవితవ్యంపై మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి.
డొక్కా వైసిపిలోకి వెళ్లకుండా రాయపాటి సాంబశివ రావు ఆపినట్లుగా తెలుస్తోంది. తాను వైసిపిలో చేరుతాననే వార్తల పైన డొక్కా ఇటీవల స్పందించారు. తాను వైసిపిలోకి వెళ్లడం లేదని, రాజకీయాలకంటే గురువు రాయపాటి ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన టిడిపిలోకి వస్తారని తెలుస్తోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications