జగన్ ఇంట్లో తిరుగుబాటు, వైఎస్ కొడుకని ఇష్టం: డొక్కా

వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ అంశాల పైనా స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను గౌరవిస్తున్నానన్నారు. జగన్ మోడీని పొగిడిన అంశంపై ప్రశ్నించగా... బిజెపికి మద్దతు పలికితే జగన్ ఇంట్లోనే మొదట తిరుగుబాటు వస్తుందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ అంటే ఇష్టమని, అంతకుమించి ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్రస్తుతం ఉన్న సమస్యలు చక్కదిద్దాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావో లేక వైయస్ రాజశేఖర రెడ్డో రావాలన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని, పార్టీకి అనుకూలంగా ఉంటానని ఆయన తెలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి చుట్టు భజనపరులు చేరారన్నారు. ఆయన పొగడ్తలకు పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను కాబట్టి తనను పట్టించుకోరన్నారు. సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications