చిరంజీవి బాధ్యత, కెవిపిపై అభియోగం నిలబడదు: డొక్కా

అభ్యర్థుల గెలుపు బాధ్యతను హైకమాండ్ చిరంజీవి భుజస్కందాలపై పెట్టిందన్నారు. తాను ఈసారి తాడికొండ నియోజకవర్గంలో పోటీ చేయడం లేదని, అధిష్ఠానం ఆదేశించిన చోట పోటీ చేస్తామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించి తన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై ఎఫ్‌బీఐ నమోదు చేసిన అభియోగాలు నిలబడబోవన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కేసులు రావడంపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టామని, ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని తయారుచేశారని తెలిపారు. ఇప్పటి వరకు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయలేదంటే దాని పరిస్థితి అర్థమవుతోందన్నారు.
అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే దమ్ము లేకనే బిజెపితో పొత్తు పెట్టుకుందన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారేమోనని దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు బయపడుతున్నారన్నారు. మోడీ ప్రధాని కావడం కల అన్నారు. టిడిపి, బిజెపి పొత్తు అనైతికమన్నారు.












Click it and Unblock the Notifications