వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలు గొప్పగా చదవాలని ఈ పనులు చేస్తున్నారా? అయితే వారిని మీరు ప్రమాదంలోకి నెడుతున్నట్టే!!

|
Google Oneindia TeluguNews

ప్రతి తల్లిదండ్రులు పిల్లలు గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రులు జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. వారు అనుకున్నది సాధించాలని, చదువులో ముందుండాలని, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలని కలలు కనని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. ఇక తల్లిదండ్రులు తాము కన్న కలలను పిల్లల మీద రుద్ది వారి బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు . పిల్లలు ఎదిగే విషయంలో,పిల్లలు చదువుకునే విషయంలో తల్లిదండ్రులు వారిపై ఎలాంటి ఒత్తిడిని పెట్టకూడదని చెబుతున్నారు. ఇంతకీ ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు పిల్లల పై ఏ విధమైన ఒత్తిడిని కలిగిస్తున్నారు అంటే..

పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రుల ప్రయోగాలు

పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రుల ప్రయోగాలు


ఎల్కేజీ లో పాఠశాలలో చేర్పించిన నాటినుండి పిల్లలు గొప్పగా చదవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో, వారికి చదివే ప్రపంచమన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల స్కిల్స్ పెంచాలన్న ఆరాటంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఏకంగా వారికి ట్యాబ్ లు, ఐపాడ్లు ఇచ్చి చదువును కుస్తీ పట్టిస్తున్నారు. అల్లరి చేసి ఆడుకోవాల్సిన వయసులో ఆటపాటలకు దూరంచేసి పుస్తకాల ముందు కూపస్థ మండూకం లా కూర్చోబెడుతున్నారు.

వయసుకు మించిన నాలెడ్జ్ కోసం వారిపై బలవంతపు చదువులు

వయసుకు మించిన నాలెడ్జ్ కోసం వారిపై బలవంతపు చదువులు

ఇంకా చాలామంది ఎల్కేజీ లోనే మావాడు గొప్పగా చదువుతాడు అని, పిల్లలపైన రకరకాల ప్రయోగాలు చేసి ఆ వయసుకు మించిన సబ్జెక్టు వారి బుర్రలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్వతహాగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఈ తరహా విధానం లో ఇబ్బంది ఎదుర్కో రు. కానీ చాలా మంది పిల్లలు తమకు ఇష్టం లేని దానిని బలవంతంగా తల్లిదండ్రులు నేర్పించే ప్రయత్నం చేస్తుంటే మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. అందుకే పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచేది విధంగా ఉండాలని, వారిని స్వతహాగా ఎదిగేలా ఉంచాలని చాలా మంది మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

అతి ఎప్పుడూ నష్టమే చేస్తుంద.. చదువులో అయినా

అతి ఎప్పుడూ నష్టమే చేస్తుంద.. చదువులో అయినా


ప్రస్తుతం తల్లిదండ్రుల కోరికలు పెరిగి, పిల్లల మీద ఒత్తిడి పెరిగిన క్రమంలో పిల్లలు కొత్తకొత్త వ్యాధుల బారిన పడుతున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందమైన బాల్యాన్ని ఆనందంగా గడిపేలా, వాళ్లంతట వాళ్లే చదువుకునేలా, చదువు పై వారికి ఇష్టం కలిగేలా, తల్లిదండ్రులు చూడాలి కానీ బలవంతంగా చదువును వారి మీద రుద్ద కూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ తల్లిదండ్రులు అలానే చేస్తే బలవంతంగా చదువులను వారి మీద రుద్దే ప్రయత్నం చేస్తే ముందు ముందు పిల్లలకు చదువు మీద ఆసక్తి పోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

పిల్లల పెంపకంలో బేసిక్ రూల్స్ ఇవే

పిల్లల పెంపకంలో బేసిక్ రూల్స్ ఇవే


పిల్లలు సరిగా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చడం పెంపకం లోని ప్రధాన అంశం అని సూచిస్తున్నారు. పిల్లల పెంపకం చదువు ఒక్కటే ప్రాధాన్యత అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఇంట్లో ఆనందం, ప్రేమ, భద్రత, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేలా చూసుకోవాలని అప్పుడు పిల్లలు సక్రమంగా ఎదుగుతారని ఇస్తున్నారు. ఇక మీ ఆలోచనలకు తగ్గట్టుగా పిల్లలను మార్చడం కాకుండా, పిల్లల ఆసక్తులకు తగ్గట్టుగా మీరు మారాలని చెబుతున్నారు. పిల్లలు ఎదగడానికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు అవసరం కానీ, పూర్తిగా తల్లిదండ్రుల ఆలోచనలను పిల్లల మీద రుద్దడం సమంజసం కాదని చెబుతున్నారు.

మీరు సాధించాలని కన్న కలలు వారిపై రుద్దితే వారి భవితవ్యం అంధకారం

మీరు సాధించాలని కన్న కలలు వారిపై రుద్దితే వారి భవితవ్యం అంధకారం


ప్రతి పిల్లలలోనూ ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ను తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులను బట్టి జాగ్రత్తగా గమనించి, అందుకు తగ్గట్టుగా ప్రోత్సాహం ఇవ్వాలి తప్ప, మనకు అవసరమైన దానిని పిల్లల నుంచి ఆశించడం తప్పు అని చెబుతున్నారు. పిల్లలను స్వచ్ఛంగా, వారు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు అనేది గుర్తించి అలానే పెంచడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మీరు మీ జీవితంలో ఏం సాధించారో .. ఏం చేశారో.. మీ పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో అదే చెయ్యాలని ఆశించడం తప్పు అని చెబుతున్నారు. అన్నిటికంటే ముందు తల్లిదండ్రులు చదువు పేరుతో పిల్లలపై ఒత్తిడి తగ్గించి, వారిని వారిలా ఎదగనిస్తే పిల్లలు అద్భుతాలు సాధించగలవారవుతారు అని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వారి భవితవ్యం మీరే నాశనం చేసిన వారవుతారు.

కామాంధుల బారిన పడకుండా.. ఇంట్లో ఆడపిల్లలకు ఈ విషయాలు చెప్పటం మర్చిపోకండి!!కామాంధుల బారిన పడకుండా.. ఇంట్లో ఆడపిల్లలకు ఈ విషయాలు చెప్పటం మర్చిపోకండి!!

English summary
Psychologists say that if parents force for studies on children the temptation to study well, then parents are putting their future at risk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X