Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శిల్పాకు బాబు షాక్: ఆ సంస్థ చట్ట విరుద్దం, రుణాలు చెల్లించొద్దు

శిల్పా సేవా సమితి నుండి తీసుకొన్న రుణాలను చెల్లించకూడదని చంద్రబాబు కోరారు..చట్టవిరుద్దంగా శిల్పా సేవా సమితిని నిర్వహిస్తున్నారని బాబు ఆరోపించారు.

నంద్యాల: నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందే చంద్రబాబునాయుడు శిల్పా సేవా సమితిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేశారు. శిల్పా సేవా సమితి నిర్వహణ చట్టవిరుద్దమని చంద్రబాబు చెప్పారు. శిల్పా సహకార సమితిలో రుణాలు తీసుకొన్నవారు తిరిగి చెల్లించకూడదని సూచించారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజున నంద్యాలలో ఆదివారం నాడు ప్రచారాన్ని నిర్వహించారు.

నంద్యాల పట్టణంలో గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్న ముస్లిం మైనార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశాన్ని నిర్వహించారు.నంద్యాలలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకొన్నారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ముస్లిం ఓట్లు ప్రభావాన్ని చూపనున్నాయి. దీంతో టిడిపి, వైసీపీలు ముస్లిం ఓట్లపై కేంద్రీకరించాయి. రెండు పార్టీల నేతలు ఈ ఓట్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

శిల్పా సహకార సమితికి రుణాలు చెల్లించకూడదు

శిల్పా సహకార సమితికి రుణాలు చెల్లించకూడదు

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని, శిల్పా సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించొద్దని, ఆ సమితి నిర్వహణ చట్టవిరుద్ధమని, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ఉప ఎన్నిక ప్రచారంలో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫంక్షన్ హాల్ లో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన సందర్భంగా బాబు ఈ వ్యాఖ్యలను చేశారు.

అధిక వడ్డీలతో వేధిస్తే చర్యలు

అధిక వడ్డీలతో వేధిస్తే చర్యలు

అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, అరాచకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని, పేదల భూములను కాజేసి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, పేదలకు అండగా ఉండాల్సిందిపోయి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను అన్నివిధాలా ఆదుకున్నది టీడీపీనేనని సీఎం చంద్రబాబు అన్నారు.

శిల్పా సేవాసంస్థ విషయాలు తెలిశాయి

శిల్పా సేవాసంస్థ విషయాలు తెలిశాయి

నిబంధనలకు విరుద్దంగా శిల్పా సేవాసంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. ఈ విషయమై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నంద్యాలలో అభివృద్ది కార్యక్రమాలకు పాల్పడుతున్న భూమా బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

ముస్లింలకే శాసనమండలి చైర్మెన్

ముస్లింలకే శాసనమండలి చైర్మెన్

నంద్యాలలో ముస్లింల సమస్యలను బాబు తెలుసుకున్నారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు చేసే వారికి ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. కులం, మతం పేరుతో కుట్రలు పన్నాలని చూస్తే ఊరుకునేది లేదని, ముస్లింలను అన్నిరంగాల్లో అభివృద్దిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, బడ్జెటల్ లో ముస్లింలకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. శాసనమండలి చైర్మన్ పదవిని ముస్లింలకే కేటాయిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+