వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హెచ్చరిక.. జగన్ సహా ఎవరైనా..': త్యాగానికి సిద్ధం కానీ: మురళీ మోహన్

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ విశాఖ వేదికగా యువత చేపడుతున్న నిరసన సందర్భంగా బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ విశాఖ వేదికగా యువత చేపడుతున్న నిరసన సందర్భంగా బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్‌ రోడ్డులోని వైఎంసీఏ కేంద్రంగా నిరసన, మౌన దీక్ష చేపడతామని యువత ముందుగా ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆర్కే బీచ్‌, పార్క్‌ హోటల్‌ మార్గాల్లో పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు. బీచ్‌ రోడ్డంతా పోలీసులతో నిండిపోయింది. నగరమంతా 144 సెక్షన్‌ విధించారు.

బాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మ

హోదా కోసం ఆంధ్రా యువత పేరుతో విశాఖ బీచ్‌లో మౌనదీక్షకు పిలుపునివ్వడం, దీనికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌, కాంగ్రెస్‌, లెఫ్ట్, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడం.. ఆర్కే బీచ్‌లో వైసిపి నిర్వహించే కొవ్వొత్తు ప్రదర్శనకు జగన్‌ హాజరవుతారని ప్రకటించడంతో విశాఖలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Don't stall development: Murali Mohan

సాగర తీరంలో ప్రతిపక్ష జగన్‌తో పాటు ఎవరు నిరసనలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలిపారు. ప్రస్తుతం సాగర తీరంలో నిరసనలు తెలిపేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎవరు నిరసనలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

అడ్డుకోవద్దు: మురళీ మోహన్

ఆందోళనలు, ఉద్యమాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. అలాగే ఆందోళనలు, ఉద్యమాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.

English summary
Telugudesam Party MP Murali Mohan said that don't stall development of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X