పవన్! మాట్లాడితే తట్టుకోలేవు, రెండోవైపు చూడకు: తమ్ముడూ అంటూనే చింతమనేని వార్నింగ్
Recommended Video

దెందులూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను రౌడీ అన్నాడని, అవును.. తాను అసెంబ్లీ రౌడీని అని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రౌడీయిజం చేస్తానని, తమ్ముడు పవన్‌పై నేను వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఆయన తట్టుకోలేడని, మూడ్రోజులు అన్నం తినలేడని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
తాను ఎవరినైనా చంపించానా, ఎవరినైనా బహిరంగ వేధింపులకు గురిచేశానా విచారణ జరిపించుకోవచ్చునని చింతమనేని ప్రభాకర్ సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు పవన్ కళ్యాణ్ బహిరంగ విచారణకు సిద్ధమా అన్నారు. దెందులూరు సభలో పూర్తిగా తనపై విమర్శలకే సమయం కేటాయించారన్నారు. తన తప్పులను ఎత్తి చూపితే పవన్‌ను తాను అభినందిస్తానని, కానీ అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు.

దాడులపై వివరణ
నేను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను భయబ్రాంతులకు గురి చేశానని పవన్ చెప్పారని, కానీ ఆయన అందర్నీ బెదిరించడం, ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడాన్ని మీరు సమర్థిస్తారా అని చింతమనేని ప్రశ్నించారు. నేను ఓ దివ్యాంగుడిని కొట్టానని చెప్పారని, నిజంగా అతను దివ్యాంగుడా అన్నారు. అతను ఎన్ని ఆస్తులు సంపాదించాడో బహిరంగ విచారణకు వస్తారా అన్నారు. ఆ ఆర్టీసీ కార్మికుడికి అన్యాయం జరుగుతుంటే, ఆయనకు న్యాయం చేయాలని చెప్పడంతో పాటు తాను అతనికి పని కల్పించానని చెప్పారు.

నన్ను రెండోవైపు చూస్తే తట్టుకోలేవు
తనను ఆకురౌడీని, వీధి రౌడీ అని అంటున్నారని, కానీ ఆయన రాబోయే సినిమాలకు ఈ పేర్లను రిజిస్టర్ చేయించుకుంటే మంచిదని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తన రౌడీయిజం ఉంటుందని చెప్పారు. సగటు మనిషికి ఉపయోగపడేందుకు తన ఆవేశం ఉంటుందన్నారు. తనను నాణేనికి ఒకే వైపు చూస్తున్నావని, రెండో వైపు చూస్తే తట్టుకోలేవని పవన్‌ను హెచ్చరించారు. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్న అభివృద్ధి అలాంటిదన్నారు. నేను చేసిన ఒక్క పొరపాటు చేయలేదన్నారు. కానీ తన రౌడీయిజం గురించి మాట్లాడారన్నారు. నేను ఎవరినీ చంపించలేదని, ఆడకూతురుకు అన్యాయం చేయలేదన్నారు. నాపై 35 కేసులున్నాయని ఓసారి, 27 కేసులు ఉన్నాయని చెప్పారని, ఎవరు ఏది రాసిస్తే అది చెప్పారన్నారు. కానీ తనపై ఉన్న కేసులు 3 మాత్రమే అన్నారు.

పులివెందుల వెళ్లి జగన్‌ను అనగలవా?
జనసేన అధ్యక్షుడిగా ఎలా ఉండాలో అలా ఉండాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా కేసులు ఉన్నాయని, పులివెందులకు వెళ్లి కూడా ఇలాగే మాట్లాడుతావా అన్నారు. జగన్, విజయసాయి రెడ్డిలను నిలదీయగలవా అన్నారు. ఈ రాష్ట్రానికి నేనేంటో నీ ద్వారా చెప్పిస్తున్నావని, తద్వారా తనను మరోసారి పరిచయం చేశావన్నారు. మహిళామణులు తనకు హారతులు ఇచ్చి, పూలుజల్లి స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎస్టీ, ఎస్సీల గురించి పవన్ మాట్లాడుతున్నావని, కానీ తాను అందరివాడిని అని చెప్పారు. నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు.

తమ్ముడూ పవన్! తెలుసుకో
నాకు నిజాయితీ ఉందని, తాను ప్రజాపక్షం అని చింతమనేని అన్నారు. తనపై ఉన్న కేసులు తొలగించాలని నేను ఎప్పుడైనా
తమ్ముడూ పవన్ కళ్యాణ్.. తెలుసుకో అన్నారు. ఓ వైపు చూడకు, రెండో వైపు కూడా చూడన్నారు. హీరో అనే విషయం పక్కన పెడితే, ఓ రాజకీయ నాయకుడిగా నీకంటే నేనే ఎక్కువ అన్నారు. నీ సామాజిక వర్గం కూడా నా వైపే తమ్ముడూ అన్నారు. నేను ఓ నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని అని, నువ్వు రాష్ట్రానికి చెందిన వ్యక్తివని, తనపై మాట్లాడటం ద్వారా నువ్వు నియోజకవర్గానికి దిగజారి, తనను పెద్ద చేస్తున్నావన్నారు. తమ్ముడూ అంటూ మాట్లాడారు.

నేను ఆఫ్టరాల్ ఎమ్మెల్యేను, నేను దేనికైనా సిద్ధం
నేను ఆఫ్టరాల్ దెందులూరుకు చెందిన సామాన్య ఎమ్మెల్యేను అని చింతమనేని అన్నారు. కానీ తమ్ముడూ.. పవన్ నువ్వు నా స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావన్నారు. హోదా కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. హోదాకు మించిన ప్యాకేజీ అంటే నువ్వు పాచిపోయిన లడ్డూ అన్నావని, ఆ పాచిపోయిన లడ్డూ కూడా కేంద్రం ఇవ్వలేదని, కానీ తమ్ముడూ.. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు నీకు నోరు రావడం లేదా అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నువ్వు ఏం చేస్తే దానికి సిద్ధమని, కానీ నిరూపించకుంటే ఆయన నేను చెప్పేదానికి సిద్ధమా అన్నారు. తన వల్ల ఎవరైనా చనిపోయారు, ఏ ఆడబిడ్డ తాళి అయినా తెగిందా అన్నారు.












Click it and Unblock the Notifications