శ్రీవారికి టీవిఎస్ స్టార్ ప్లస్ టూ వీలర్ (పిక్చర్స్)
తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి భక్తులు విలువైన, అరుదైన కానుకలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. టీవిఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ టీవిఎస్ స్టార్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు. దాన్ని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రదానం చేశారు.
దేశంలోని మార్కెట్‌లో దాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. దాని విలువ 56 వేల రూపాయలు ఉంటుంది. తిరుమల పవిత్ర స్థలం సాక్షిగా దాన్ని టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంజి గోపాల్ అందుకున్నారు.

టిటి జెఇఓ కెఎస్ శ్రీనివాస రాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కర్ ఆర్ సెల్వం తదితరులు ఈ సందర్భంగా ఉన్నారు. శ్రీవారికి భక్తులు గుప్తదానాలు కూడా చేస్తుంటారు.













Click it and Unblock the Notifications