రైతులను మోసం చేస్తే కఠినంగా శిక్షిస్తాం : చంద్రబాబు
అమరావతి :రైతులను మౌసం చేసిన వారిని జైలుకు పంపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు.రైతాంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు.
రైతుల సమస్యలపై శుక్రవారం నాడు ఆయన వ్యవసాయశాఖ అధికారులతో టెలి కాన్పరెన్స్ నిర్వహించారు.నదుల అనుసంధానంతో సకాలంలో రైతులకు నీరు అందుతోందన్నారు. రాష్ట్రంలో 19 శాతం వర్షపాతం లోటుగా నమోదైన, 96 శాతం పంటలు సాగయ్యేలా చేశామన్నారు సిఎం.

రసాయన ఎరువుల వినియోగాన్ని క్రమేణా తగ్గించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో 17 శాతం రసాయన ఎరువుల వినియోగం తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు..రబీలో రసాయన ఎరువుల కంటే సెంద్రీయ ఎరువుల వాడకంపై కేంద్రీకరించాలని ఆయన అధికారులకు సూచించారు.
వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాదించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెయిన్ గన్స్ ను వినియోగించి పంటలను కాపాడాలని ఆయన సూచించారు. రైతులను మోసం చేస్తే జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు.రబీ సీజన్ లో రెయిన్ గన్స్ వినియోగాన్ని వందశాతం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారాయన,.












Click it and Unblock the Notifications