వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై బీజేపీ అనుమానం: కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్తున్నారా?.. 'ప్రభావితం' కావొద్దని కామెంట్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయా?.. బీజేపీ-టీడీపీల బంధానికి తెరపడపడబోతుందా?.. చెప్పినట్టుగానే ఏపీ అధికార పక్షం ఇక తెగదెంపులకు సిద్దపడుతోందా?... బీజేపీ శిబిరంలోనూ ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP

తాజాగా విశాఖ ఎంపీ హరిబాబుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు.. కాంగ్రెస్ పట్ల టీడీపీ ప్రభావితం అవుతోందన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

 నరసింహారావు కామెంట్:

నరసింహారావు కామెంట్:

'ఏపీకి ఏం చేయాలనే విషయంపై అన్ని కోణాల్లోనూ చర్చిస్తున్నాం. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ను గొప్పగా నిలబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం. అంతే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఈరోజు రాహుల్ గాంధీ కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. దాన్ని చూసి ఇతరులు ప్రభావితం కావడం సరికాదు. రాహుల్‌కు విశ్వసనీయత లేదు.' అని నరసింహరావు వ్యాఖ్యానించారు.

టీడీపీ ప్రభావితం అవుతోందా?..:

టీడీపీ ప్రభావితం అవుతోందా?..:

రాహుల్ వ్యాఖ్యలకు ఇతరలు ప్రభావితం అవడం సరికాదంటూ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించినవే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీ ఆదేశాల మేరకే హరిబాబు, నరసింహారావు నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపికి నచ్చజెప్పడానికి.. తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే ఈ సమావేశం నిర్వహించినట్టు హరిబాబు, నరసింహారావు వ్యాఖ్యలను బట్టి అర్థమైంది.

 అందుకే చెప్పిస్తున్నారా..:

అందుకే చెప్పిస్తున్నారా..:

ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో టచ్ లోకి వెళ్తున్నారా? అన్న అనుమానం అటు ప్రధానికి కూడా కలిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పట్ల ప్రభావితం కావద్దంటూ బీజేపీ నేతలతో చెప్పించే ప్రయత్నం చేశారన్న వాదన వినిపిస్తోంది.

సోనియాతో భేటీ తర్వాత:

సోనియాతో భేటీ తర్వాత:

బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలను పిలిపించుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జరిపిన మంతనాలు బీజేపీకి ఈ అనుమానం కలిగేలా చేశాయి.

రాష్ట్ర పరిస్థితుల్ని తెలుసుకున్న సోనియా టీడీపీకి భరోసా ఇవ్వడం... విభజన హామిలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అటు రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం వారికి మంటపుట్టించేలా చేశాయి. ఎక్కడ టీడీపీని కాంగ్రెస్ తమవైపుకు తిప్పుకుంటుందో అన్న అనుమానాలు వారిని కలవరపెడుతున్నాయి.

 ఓ కన్నేసి ఉంచారా?:

ఓ కన్నేసి ఉంచారా?:

ఏపీ అధికార పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా లీకులు వస్తుండటంతో టీడీపీపై బీజేపీ ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. సీఎం చంద్రబాబు బలహీనతలను బయటకు లాగి తగిన బుద్ది చెప్పాలని యోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం అనిపిస్తోంది.

English summary
BJP Leader GVL Narasimharao requested TDP members that don't trust and attract towards Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X