ఏపీలో భారీగా తగ్గిన కరోనా- 24 గంటల్లో 4500 కేసులు-60 మరణాలు

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. చాలా జిల్లాల్లో కరోనా ప్రభావం దాదాపుగా తగ్గింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో నిర్వహించిన 87756 కరోనా పరీక్షల్లో 4500 కొత్త కేసులు రాగా, 60 మరణాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో కూడా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటకపోవడం విశేషం.

ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో నమోదైన 4549 కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 860 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 619, పశ్చిమగోదావరిలో 529, కడపలో 412, గుంటూరులో 322, అనంతపురంలో 272, విశాఖలో 263, విజయనగరంలో 247, శ్రీకాకుళంలో 228, కృష్ణాలో 210, ప్రకాశంలో 207, కర్నూల్లో 198, నెల్లూరులో 182 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18.14 లక్షలకు చేరింది. ఇందులో 17.22 లక్షల మంది కోలుకున్నారు. మరో 80 వేల యాక్టివ్‌ కేసులున్నాయి.

double covid recoveries than new cases in ap, 4500 infections and 60 deaths in 24 hours

మరణాల విషయానికొస్తే చిత్తూరులో అత్యధికంగా 12 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత ప్రకాశంలో 8, పశ్చిమగోదావరిలో 6, కృష్ణాలో 5, అనంతపురంలో 4, తూర్పుగోదావరిలో 4, శ్రీకాకుళంలో 4, గుంటూరులో 3, కర్నూల్లో 3, విశాఖలో 3, విజయనగరంలో 3, కడపలో 2, నెల్లూరులో 2 మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 11,999కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10114 మంది కోలుకున్నారు. ఇది కొత్తకేసులతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+