అనంతలో జంట హత్యలు: ఇద్దరిని నరికి చంపారు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జంట హత్యల కలకలం రేగింది. జిల్లాలోని గుంతకల్లు మండలం నాగసముద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అతి కిరాతకంగా నరికి చెంపారు. వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి, లాలెప్ప అనే వ్యక్తులు ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందారు. గుంతకల్లు ఆర్టీసీ డీపోలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న రంగ నాయకులు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటన జరిగిన ప్రదేశంలో రంగనాయకులు గర్తింపు కార్డుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం అందరూ విచారణ వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. జంట హత్యల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మనవడి మరణ వార్తను తట్టుకోలేక తాత మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని రామసముద్రం మండలం నర్సాపురంలో పాము కాటుకు గురైన జీవన్ కుమార్ అనే యువకుడు మరణించాడు. మనవడి మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో తాత మృతి చెందాడు. తాతా మనవళ్ళు ఒకేసారి మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
విజయవాడలో ఓ మహిళతో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని ఎంజీ రోడ్డులో షాపింగ్‌కు వచ్చిన మహిళతో కానిస్టేబుల్ దుర్భాషలాడటమే కాకుండా, ఫోటోలు తీసి అభ్యసంగా ప్రవర్తించాడని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సదరు ఆ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications