వైసీపీ నెత్తిన పాలు పోసిన కేంద్రం- ఎవరూ ఊహించని అస్త్రం

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ ప‌ద్ధ‌తిలో ప్రైవేట్‌ప‌రం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.

వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సైతం సందర్శించారు. ప్రైవేటీకరణ, పీపీపీ విధానానికి మద్దతుగా జనం మద్దుతను కూడగట్టారు. అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. సేకరించిన సంతకాలన్నింటినీ గవర్నర్ కు అందజేయనున్నారు జగన్.

Dr Appalaraju Defends Jagan s Legacy Against Coalition Propaganda

ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భారీగా పెంచింది. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా 106 సీట్ల మంజూరు చేసింది. వాటిని భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

దీనిపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల్రాజు స్పందించారు. రాష్ట్రానికి పీజీ సీట్లను కేటాయించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ విషప్రచారనికి తెరపడిందని తేల్చి చెప్పారు. జగన్ హయాంలో మెడికల్ కాలేజీలే కట్టలేదంటూ, పాత ఫొటోలతో దుష్ప్రచారం చేసిన మంత్రులు.. కాలేజీలు కట్టకపోతే ఎన్ ఎమ్ సీ పీజీ సీట్లు ఎందుకు కేటాయించిందో సమాధానం చెప్పాలని నిలదీశారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చూస్తే ప్రజలకు జగనే గుర్తుకువస్తాడనే కారణంతోనే పీపీపీ పేరుతో వాటిని తమ వారికి కట్టజెప్పే కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి జరగాలని, పేదలు నాణ్యమైన వైద్యం, డాక్టరు కావాలన్న పేదవాడి కల నిజం కావాలని జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం పదే, పదే చెబుతుంటే మరోవైపు చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర కూటమి నేతలు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని దుష్ప్రచారం చేశారని అన్నారు.

అదే సమయంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని క్లాసులు ప్రారంభమైన అయిదు మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లను మంజూరు చేసిందని, దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయాలు రావాల్సిన చోట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముడుపోయి వారికి ప్రభుత్వ ఆస్తులను పప్పు, బెల్లాల్లా ధారాధత్తం చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+