హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒడిషా డిఆర్‌డివో శాస్త్రవేత్తపై బాల చోరుడి దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని చార్మినార్ సందర్శించేందుకు వచ్చిన డిఆర్‌డివో శాస్తవ్రేత్త రాధాకృష్ణ సత్యపతిపై బాల ఖైదీ బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. ఆదివారం మధ్యాహ్నం చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. దుండగుడిలో దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణను తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం ఆయన్ని కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డివో అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు పాతబస్తీకి చెందిన మైనర్ బాలుడిగా గుర్తించారు. దొంగతనాన్ని ఆపబోయినందుకు ఆ బాలుడు శాస్త్రవేత్తపై దాడి చేశాడు.

DRDO scientist attacked by juvenile thief at Charminar

ఒడిషా రాష్ట్రంలోని సోనాపేట డిఆర్‌డివోలో రాధాకృష్ణ సత్యవతి శాస్తవ్రేత్త. నగరంలో జరుగుతున్న ఓ సదస్సుకు పాల్గొనేందుకు వచ్చిన రాధాకృష్ణ ఆదివారం సహచరులతో కలిసి చార్మినార్‌ను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో దుకాణంలో షాపింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఓ బాలుడు సహచరుడి మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోతుండగా రాధాకృష్ణ పట్టుకున్నాడు. దొంగను పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నించగా దుండగుడు బ్లేడుతో రాధాకృష్ణపై దాడి చేసి పారిపోయాడు.

దాడిని అడ్డుకోబోయిన మరో వ్యక్తిని కూడా దుండగుడు గాయపరిచి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న సౌత్ జోన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ శాస్తవ్రేత్తను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం నగరంలోని డిఆర్‌డివో ఆసుపత్రికి తరలించారు.

ఇలా ఉండగా సౌత్ జోన్ డిసిపి సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగి దాడి వివరాలు ఆరా తీశారు. నిందితుడ్ని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి గాలించారు. చార్మినార్, మక్కా మసీదు సమీపంలోని సిసి కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడ్ని పాతబస్తీకి చెందిన ఓ మైనర్ బాలుడిగా గుర్తించారు. బాలుడిపై గతంలో కూడా పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

English summary
A senior defence scientist at a military facility in Koraput in Odisha was attacked with a razor blade by a juvenile thief in the crowded Charminar area on Sunday. Though he suffered bleeding injuries, he is said to be stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X