బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కి చెందిన రూ.189 కోట్ల విలువైన యంత్రాలను సీజ్ చేసిన డిఆర్ఐ
కడప: బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌పై డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఝళిపించింది. జిల్లాలోని బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు సంబంధించిన రూ.189 కోట్ల విలువైన యాత్రాలను డీఆర్‌ఐ సీజ్ చేసింది.
2009లో చెన్నై ఓడరేవు నుంచి బ్రాహ్మణి ఇండస్ట్రీస్ యంత్రాలను దిగుమతి చేసుకుంది. అయితే ఈ వ్యవహారంలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్ డీఆర్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన యంత్రాలను బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉపయోగించడంలేదు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు భూమిని కేటాయిస్తూ జారీ అయిన జీవోను 2013 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10,760 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం విషయంలో నిబంధనలను పాటించకపోవడంతో భూకేటాయింపు జీవోను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. సకాలంలో బ్రాహ్మణి స్టీల్స్ పూర్తి కాకపోవడంతో ఈ సంస్థ వ్యవహారం వెలుగు చూడగా ఈ కర్మాగారానికి ఉపయోగించుకునేందుకు కేటాయించిన ఓబుళాపురం గనుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications