తప్పతాగి 4 నెలల చిన్నారిని తొక్కిన ఏఎస్సై, మృతి

పోలీసుల కథనం ప్రకారం... దుబ్బాక మండలం హబ్షీపూర్‌కు చెందిన ఎల్లయ్య, రేఖల చిన్న కుమార్తె నిఖిత. ఆమె వయస్సు నాలుగు నెలలు. ఎల్లయ్యకు దాయాదులైన పరుశురాం, బీరయ్యలతో భూతగాదా ఉంది. ఈ విషయమై ఈ నెల 13న బీరయ్య దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణ నిమిత్తం అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఏఎస్సై పాషా ఎల్లయ్య ఇంటికి వెళ్లాడు. అప్పటికే అతను తాగి ఉన్నాడు. ఎల్లయ్యను ఈడ్చుకు వెళ్తుంటే భార్య రేఖ అడ్డుపడింది. ఈ పెనుగులాటలో రేఖ ఒడిలోని చిన్నారి జారి కింద పడింది. ఆవేశంలో ఉన్ ఏఎస్సై పాప నడుపుపై బూటు కాలితో తొక్కాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం మృతి చెందింది. దీంతో ఎల్లయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దుబ్బాక పోలీసు స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ ఏఎస్సైపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications