కెసిఆర్‌పై డిఎస్ ఫైర్: బ్లాక్‌మెయిల్ వద్దన్న దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు నేత డి. శ్రీనివాస్ నిప్పులు చెరగగా, కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన సర్వేను బిజెపి సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ సమర్థిస్తూ హితవు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కోతలు, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌పై డిఎస్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని డిఎస్ ఆందోళనలకు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలు జారీ చేయలేదన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నోటిషికేషన్‌ను విడుదల చేయాలని డీఎస్ డిమాండ్ చేశారు.

DS questions KCR, Dattatreya supports

ఇదిలావుంటే, డేటా కోసం సర్వే జరిపితే మంచిదే అని, అయితే సర్వేను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయవద్దని బిజెపి నేత బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ఒంటెత్తు పోకడలూ సరికాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెం

డు రాష్ట్రాల సీఎంల చర్చలు శుభపరిణామమని ఆయన అన్నారు. గవర్నర్ లేకుండానే ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని సూచించారు. ఇలాంటి సమావేశం ఎప్పుడో జరగాల్సిందని దత్రాత్రేయ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+