మోసం చేశాడని భర్త ఇంటి ఎదుట డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత ఆందోళన
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత . ఆమె భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.
గుంటూరు:గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత . ఆమె భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.
ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకొని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్షకు దిగింది.

హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యశ్వంత్ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్ బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందిని సుజాత చెప్పింది.
యశ్వంత్ పెళ్ళి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పారు. అయితే పెళ్ళి చేసుకొన్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.












Click it and Unblock the Notifications