School Holidays: ఆ జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు.. రీ ఒపెన్ ఎప్పుడంటే..
మాండూస్ తుఫాన్ ముంచుకొస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరుతో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. తుఫాన్ వల్ల ప్రభావితం అయ్యే జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లా
మాండూస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌తో పాటు ,అన్ని మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మాండూస్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కోనసీమ జిల్లా
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాండూస్ తుఫాన్ ప్రభావంతో సముంద్రం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది.నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి తెలిపారు. సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రీపెన్ పై త్వరలో సమాచారం ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications