దురంతో ఎక్స్ ప్రెస్‍కు అడ్డుగా బొలెరో.. బలంగా ఢీకొట్టిన రైలు.. 5 గంటలు ఆలస్యం.. ఏం జరిగిందంటే.. !
130 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ కు అడ్డంగా ఓ వాహనం వచ్చింది. అంత స్పీడ్ రైలు కంట్రోల్ చేయలేక వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంతో రైలు 5 గంటలు ఆలస్యంగా గమ్యం చేరుకుంది. దురంతో ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాపట్నం వెళ్తోంది. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురువారం తెల్లువారుజామున 3 గంటలు జరిగినట్లు తెలుస్తోంది.
భీమడోలు రైల్వే గేటు వద్ద దురంతో ఎక్స్ ప్రెస్ వస్తుండడంతో అక్కడున్న రైల్వే గేటు సిబ్బంది గేటు మూసివేశారు. అదే సమయంలో వేగంగా వచ్చిన బోలెరో వాహనం రైల్వే గేటు గుద్దుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా పట్టాలపై ఆగిపోయింది. దురంతో ఎక్స్ ప్రెస్ రాకను గమనించిన బొలెరోలో ఉన్న వారు బయటకు దూకి పారిపోయారు. రైలు వేగంతో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది. రైలు ఇంజిన్ కూడా దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఇంజిన్ మార్చి రైలు పంపించారు. ఇందుకు దాదుపు 5 గంటల సమయం పట్టింది.

అంతకుముందు అడ్డంగా ఉన్న బొలెవానాన్ని పక్కకు నెట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుకుని ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఇతర మార్గాల్లో వెళ్లిపోగా.. రైల్లో ఉన్న వారు 5 గంటలు ఆలస్యంగా గమ్యం చేరుకున్నారు. అయితే బొలెరో వాహనం ఎవరిది.. వారు కావాలనే రైల్వే ట్రాప్ పైకి వచ్చారా.. లేక వానహం అదుపు చేయలేక వచ్చారా అనేది తెలియరాలేదు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
దురంతో ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం#DuranthoExpress #Durantho #Oneindiatelugu pic.twitter.com/R4i8glfeim
— oneindiatelugu (@oneindiatelugu) March 30, 2023












Click it and Unblock the Notifications