ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులివే..! మార్పుకు డిమాండ్లు..!
ఏపీలో దసరా సందర్భంగా విద్యాసంస్థలకు త్వరలో సెలవులు ప్రకటించబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ను అనుసరించనున్నారు. అయితే ఈసారి దసరా ముందుగానే వస్తుండటంతో సెలవుల్ని పెంచాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీనిపై ప్రభుత్వం వివిధ వర్గాల్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే స్కూల్స్, కాలేజీలు, మైనార్టీ విద్యాసంస్థలకు వేర్వేరుగా సెలవులు ఉన్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్భంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ సెలవులు ఉండబోతున్నాయి. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్ లోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ లెక్కన మొత్తం 9 రోజులు సెలవులు రాబోతున్నాయి. అయితే దసరా పండుగ ముందుగానే వస్తుంది కాబట్టి 22 నుంచే సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ గోపీ మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అలాగే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇవ్వబోతున్నారు. వీటిని కూడా పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చివరిగా క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు 6 రోజుల సెలవులు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులపై ప్రకటన చేసింది.
దీని ప్రకారం స్కూళ్లకు దసరా సెలవుల్ని ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకూ ప్రకటించారు. అలాగే కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకూ సెలవులు ప్రకటించారు. కాబట్టి ఏపీలోనూ 21 లేదా 22 నుంచి సెలవులు ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే మరో 10 రోజల సమయం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ లోపు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications