విజయవాడ నుంచి విశాఖ, పలాస ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపటి నుంచి ఈ రైళ్లు..!
దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. జనం సొంతూళ్లకు వెళ్లేందుకు ఒకేసారి ఎగబడుతుండటంతో రైళ్లలో టికెట్లు అస్సలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ-విశాఖపట్నం (Vijayawada-Visakhapatnam), విజయవాడ-పలాస (Vijawada-Palasa) మార్గాల్లో జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక రైళ్లను వివిధ తేదీల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయవాడ డివిజన్ ప్రకటించింది.
విశాఖపట్నం-విజయవాడ మధ్య రైలు నంబర్ 07717ను అక్టోబర్ 17న నడపనున్నారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య రైలు నంబర్ 07718 అక్టోబర్ 19న అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు రెండు వైపులా దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయి. అలాగే విజయవాడ-పలాస మధ్య రైలు నంబర్ 07452 అక్టోబర్ 17, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

పలాస-విజయవాడ మధ్య రైలు నంబర్ 07451 అక్టోబర్ 18, 19 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లకు రెండు వైపులా ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. దసరా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, అలాగే ఆ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వారు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications
