డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..! సబ్సిడీపై ఈ-బైక్, ఈ-ఆటో..! దరఖాస్తు ఇలా..!

ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలతో పాటు ప్రత్యేక జాబ్ మేళాలు, ఇతర ప్రయోజనాలు అందజేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఈ-వాహనాల కొనుగోళ్ల విషయంలోనూ సహకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ-బైక్, ఈ-ఆటో కొనుగోలు చేసే వారికి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది. ఇందులో E-Bike కొనుగోలు చేస్తే ₹ 12,000 సబ్సిడీ, E-Auto కొనుగోలు చేస్తే: ₹30,000 సబ్సిడీ అందిస్తోంది. పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పిస్తారు. Rapido ద్వారా నెలకు ₹25,000 - ₹30,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

DWCRA Women Apply Now for AP Government Subsidy on E-Bike and E-Auto Purchases free training

దీనికి ప్రధాన అర్హత డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. దరఖాస్తు చేసేందుకు జిల్లా మెప్మా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, డ్వాక్రా ఐడీ సమర్పించాలి. అలాగే దరఖాస్తు ఫారం నింపాలి. 15 రోజుల్లో లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైతే E-Bike లేదా E-Auto అందజేస్తారు.

DWCRA Women Apply Now for AP Government Subsidy on E-Bike and E-Auto Purchases free training

అయితే ఈ పథకం ప్రస్తుతం విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలులోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర పట్టణాలకు విస్తరిస్తారు. డ్వాక్రా మహిళలకు నిత్యం ఎక్కడో చోటికి ప్రయాణిస్తూ తమ గ్రూపు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఇప్పటికే మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. అయితే తక్కువ దూరాలకు, బస్సు రూటు లేని చోట్ల ఈ ఈ-బైక్, ఈ-ఆటోలు వారికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+