పవన్ నిర్ణయం వెనుక - ఏం జరుగుతోంది..!!

డిప్యూటీ సీఎం పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందటం పైన పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. జనసేన నుంచి ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇదే సమయంలో ప్రమాదం జరిగిన రోడ్డు ను ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితులకు అండగా నిలుస్తూనే.. తాను ఇక పిఠాపురం ఆ రోడ్డు మీదుగా వెళ్తానంటూ.. తన మార్క్ నిరసన కు సిద్దమయ్యారు. ఇప్పుడు పవన్ నిర్ణయం వెనుక పరమార్థం పైన చర్చ జరుగుతోంది.

స్పందించిన పవన్
రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం పైన డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున సాయం ప్రకటిం చారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ హీరో రామ్ చరణ్ రూ 10 లక్షల చొప్పున, నిర్మాత దిల్ రాజు రూ 5 లక్షల చొప్పున సాయంగా ప్రకటన చేసారు. ఇక, ఈ ప్రమాదం పైన స్పందించిన పవన్ కాకినాడ - రాజమహేంద్ర వరం మధ్య ఏడీబీ రోడ్డు ఛిద్రమైందని.. గత అయిదేళ్లు కాలంలో ఎవరూ పట్టించు కోలేదని చెప్పుకొచ్చారు.

DY CM Pawan announce ex gratia for two fans who died while returning from the Game Changer event

పార్టీ నుంచి సాయం
పాడైపోయిన ఈ రోడ్డును కొంతకాలంగా బాగు చేస్తున్నారని పవన్ వెల్లడించారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు పోవటం బాధాకరమని చెప్పారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదని వివరించారు. సరైన విద్యుత్‌ దీపాలు కూడా లేవని.. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఐదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు అని పవన్ వివరించారు. రెండు నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్డు మీద వెళ్తున్నారు.

అదే రోడ్డు మీదుగా వెళ్లాలని
ఇళ్లకు సురక్షితంగా వెళ్లండి అని ఆరోజు వేడుకలో ఒకటికి, రెండు సార్లు చెప్పానని పవన్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం తనకు బాధ కలిగించదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు స్పష్టం చేప్పినట్లు వెల్లడించారు. ఇకనుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలనే నిర్ణయించుకున్నట్లు పవన్ వెల్లడించారు. అయితే, అదే రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలని పవన్ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. రోడ్డు త్వరగా పూర్తి చేసేలా ఒత్తిడి పెంచేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతల అభిప్రాయ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+