పవన్ కు ఇదేనా విలువ, కరివేపాకులా - జనసైనికుల ఫైర్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీ మే 2న రానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ కోసం కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమరావతి రైతులకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికలో ప్రధాని - సీఎం చంద్రబాబు పేరు మాత్రమే ఉండటం ఇప్పుడు వివాదంగా మారుతోంది. పవన్ పేరు ఎందుకు లేదని జనసైనికులు నిలదీస్తున్నారు.
పవన్ పేరు లేకపోవటంతో
అమరావతిలో ప్రధాని పర్యటన వేళ ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేదు. ప్రధాని - ముఖ్యమంత్రి పేర్లు మాత్రమే ఉండటం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను "కూరలో కరివేపాకు"లా పక్కనపెట్టారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, జనసేన పార్టీని ట్యాగ్ చేసి పవన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాము కూటమి లో విధేయులుగా ఉంటున్నామని.. బానిసలం కాదని పోస్టింగ్స్ చేస్తున్నారు. కూటమిగా మూడు పార్టీల ను కలపటం.. అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించిన పవన్ ను ఎలా విస్మరిస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి విషయంలో ఎన్నికల ముందు నుంచే పవన్ మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఆహ్వాన పత్రికలో
ప్రధాని వస్తుండటంతో.. అమరావతి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను రూపొందించారు. అందంగా డిజైన్ చేసిన ఆహ్వాన పత్రికలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికల్లో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు, అమరావతి స్థూపం చిత్రాలు ఉన్నాయి. అలాగే నగర నిర్మాణాన్ని ప్రతిబింబించే ఊహ చిత్రాలు ఈ పత్రికలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన.. పంపిణీ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వంలో.. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ పేరు లేకపోవటం పైన ఆయన అభిమానులు.. జనసైనికులు మాత్రం మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications