పవన్ సీరియస్ - తేల్చేద్దాం, డెడ్ లైన్ ఫిక్స్..!!

డిప్యూటీ సీఎం పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్ పాత్ర కీలకంగా మారుతోంది. సోషల్ మీడియా కేసుల అంశంలో హోం మంత్రిపైన వ్యాఖ్యలు.. ఆ తరువాత సీజ్ ది షిప్ వ్యవహారం.. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన వేళ పవన్ స్పందించిన తీరు పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో పవన్ దశాబ్దాల కాలంగా ఉద్యోగుల పైన విజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉండటం పైన సీరియస్ అయ్యారు. ఈ అంశం పైన తాను పర్యవేక్షిస్తున్న అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు.

పవన్ తాజా ఆదేశాలు
ఉద్యోగుల పైన సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విజిలెన్స్ కేసుల పైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీసారు. ఇన్నేళ్లు పెండింగ్ లో ఉండటం ఏంటని నిలదీసారు. ఎన్ని కేసులు ఇలా పెండింగ్ లో ఉన్నాయని లెక్కలు అడిగారు. విచారణలో జాప్యానికి కారణాలు.. కేసుల వివరాలతో తనకు మూడు వారల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని..ఉద్యోగులు అప్రమత్తంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉండడం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతోందని పవన్‌ పేర్కొన్నారు.

DY CM Pawan seek the report over vigilance cases on his Employees with in three weeks

కేసుల జాప్యం వెనుక
తన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖల్లో విజిలెన్స్‌, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, అందుకు గల కారణాలపై మూడు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌ దృష్టికి తెచ్చారు. దీంతో, పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అపరిష్కత కేసుల వల్ల అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటెర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందలేక పోతున్న విషయం చర్చకు వచ్చింది. వీటి కారణంగానే పదోన్నతుల్లో వెనుకబడిన అధికారులు కూడా ఉన్నారని గ్రహించారు. విచారణ వేళ తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని.. దీని కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు వివరించారు.

మూడు వారాల సమయం
దీంతో, తన శాఖల పరిధిలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు పవన్‌ ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలో బలమైన సాక్ష్యాలు సేకరించాలని.. విచారణ అధికారికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్‌, నాన్‌ విజిలెన్స్‌ కేసులను సరైన రీతిలో తిరిగి విచారించి, వేగంగా పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు. మూడు వారాల తరువాత ఈ కేసుల విషయంలో తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+