విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ రూ 30 కోట్లు ఆఫర్ చేసింది - డిప్యూటీ సీఎం రాజన్నదొర..!!

|
Google Oneindia TeluguNews

విజయనగరం : డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేసారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేసింది. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవటంతో పాటుగా అందులో నలుగురికి మంత్రి పదవులు కేటాయించింది. దీని పైన ప్రతిపక్ష వైసీపీ నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభను బహిష్కరించింది. ఇదే అంశాన్ని నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక, ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ డిప్యూటీ సీఎం రాజన్న దొర తనకు నాడు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ గురించి వివరించారు.

రూ 30 కోట్లు ఆఫర్ చేసింది

రూ 30 కోట్లు ఆఫర్ చేసింది

నాడు టీడీపీలో చేరితో తనకు రూ 30 కోట్లు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు ఆఫర్ చేసారని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా పిల్లల చదువు..మంత్రి పదవి..అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పారంటూ వెల్లడించారు. కానీ, తమ నాయకుడు జగన్ పైన ఉన్న అభిమానంతోనే తాను పార్టీ వీడలేదని గుర్తు చేసుకున్నారు. టీడీపీలోకి వెళ్లకపోవటం వలనే తానను ఈ రోజు మంత్రి పదవిలో ఉన్నానని వివరించారు.

తనకు తొలి కేబినెట్ లో మంత్రి పదవి రానందుకు బాధ పడలేదని.. పుష్పశ్రీ వాణీకి అవకాశం వచ్చినా ఏనాడు విమర్శ చేయాలేదని చెప్పుకొచ్చారు. డ్వాక్రా రుణ మాఫీ పేరుతో టీడీపీ హయాంలో వేల కోట్లు దోచుకున్నారని చెబుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ 27 వేల కోట్లు మాఫీ చేసందని వివరించారు.

23 మంది అవుట్ .. 2019లో 23 సీట్లు

23 మంది అవుట్ .. 2019లో 23 సీట్లు

టీడీపీ హయాంలో విజయనగరం జిల్లా నుంచి సజయ రంగారావు వైసీపీ నుంచి గెలిచినా నాడు టీడీపీలోకి చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి బొబ్బిలి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వారిలో తిరిగి 2019 ఎన్నికల్లో అద్దంకి ఎమ్మల్యే గొట్టిపారి రవి ఒక్కరు మాత్రమే గెలుపొందారు.

మిగిలిన వారంతా ఓటమి పాలయ్యారు. మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురిలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన భూమా అఖిల ప్రియ.. పలమనేరు నుంచి పోటీ చేసిన అమరనాధ రెడ్డి.. కడప ఎంపీగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి.. సజయ రంగరావు సైతం పరాజయం పాలయ్యారు.

రాజన్న దొర వ్యాఖ్యలతో మరోసారి

రాజన్న దొర వ్యాఖ్యలతో మరోసారి

టీడీపీ హయాంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తమ వైపు తిప్పుకోగా.. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలే గెలిచింది. అదే విధంగా వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు వళ్లారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మూడు ఎంపీ స్థానాలే దక్కాయి. దీని పైన జనగ్ సైతం గతంలో సెటైరికల్ గా స్పందించారు. 2019 మే 23న ... టీడీపీ 23 స్థానాలే దక్కించుకోవటం..మూడు ఎంపీ స్థానాల్లో గెలవటం దేవుడి స్క్రిప్టు అంటూ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్న దొర వ్యాఖ్యలతో మరసారి ఈ అంశాలన్నీ చర్చకు కారణమయ్యాయి.

English summary
Dy CM Rajana Dora Revealed that TDP offered rs 30 cr to leave YSRCP. He says rejected the TDP Offer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X