ఎంసెట్ ఫలితాలు విడుదల: ర్యాంకర్లు వీరే

హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఎంసెట్‌లో 70.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 70.78శాతం, వైద్య వ్యవసాయ విభాగంలో 83.16శాతం ఉత్తీర్ణులైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల మొబైల్ ఫోన్లకే ఎస్ఎంఎస్ ద్వారా ఎంసెట్ ఫలితాలు అందించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన పవన్ కుమార్ ఎంసెట్‌లో 158 మార్కులతో మొదటి ర్యాంకును సాధించాడు.

మంగళవారం సాయంత్రం నుంచి వెబ్ సైట్‌లో ఓఎంఆర్ షీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. జూన్ 13 సాయంత్రం 5గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఫలితాలను పారదర్శకంగా వెల్లడించంలో భాగంగా తొలిసారిగా ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 29 నుంచి ఇంజినీరింగ్, జులై 15 నుంచి మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

EAMCET 2014 Results released

పదేళ్లపాటు ఉమ్మడి పరీక్షలు నిర్వహించడం ఇబ్బందేనని అన్నారు. విడివిడిగా రెండు విద్యాశాఖలను తొందరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

ఎంసెట్‌లో 1,88,831 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన టాప్ 10 విద్యార్థులు:

1 పవన్ కుమార్ (హైదరాబాద్)
2 చాణక్య వర్ధన్ రెడ్డి
3 లక్కుమారపు నిఖిల్ కుమార్
4 గొల్లపూడి దివాకర్ రెడ్డి
5 ఆదిత్య వర్ధన్
6 ప్రేమ్ అభినవ్
7 అక్షయ్ కుమార్ రెడ్డి (నాగర్ కర్నూల్)
8 సాయి కశ్యప్ నల్గొండ
9 సాయి సూర్య ప్రహర్ష
10 సాయిచైతన్య తార్నాక

మెడిసిన్ ర్యాంకర్లు

1. గుర్రం సాయి శ్రీనివాసులు (మార్కాపురం)
2. డి దివ్య (సుళ్లూరుపేట)
3. కందికొండ పృథ్వీరాజ్ (హైదరాబాద్)
4. దారపనేని హరిత (గుంటూరు)
5. ఉరుబండి మనోజ్ఞిత (విజయవాడ)
6. తేగు భరత్ కుమార్ (ఖమ్మం)
7. పట్టిసపు శ్రీదివ్య విశాఖ (విశాఖ)
8. సాత్విక్ గంగిరెడ్డి (హైదారాబాద్)
9. రాయల హర్ష తేజ (ఖమ్మం)
10 సాయి నిఖిల (తెనాలి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+