వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ప్యాంట్రీ వాహనంలో డబ్బు కలకలం.. రివర్స్: 'సీఎం భద్రతకు ముప్పు వాటిల్లేలా, కుట్రకోణం'

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించనున్న రోడ్డు షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించనున్న రోడ్డు షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

చదవండి: జన'సేన' కోసం రంగంలోకి వైసిపి: పవన్ కళ్యాణ్ ఎమోషన్ మిస్సయిందా?

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్యాంట్రీ వాహనం విజయవాడ నుంచి నంద్యాలకు శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఈ వాహనంలో కోట్లాది రూపాయలు తరలిస్తున్నారంటూ ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం అందింది.

ప్యాంట్రీ వాహనం అని చెప్పారు

ప్యాంట్రీ వాహనం అని చెప్పారు

ఈ నేపథ్యంలో గాజులపల్లె మెట్ట శివార్లలో ఎన్నికల కమిషన్ పరిశీలకులు, పోలీసులు ఈ వాహనాన్ని అడ్డగించారు. ఆర్టీసీ పేరుతో రిజిస్టర్ అయిన కంటైనర్ (నెంబర్ ఏపీ 16 జడ్ 0363) సీఎం ప్యాంట్రీ వాహనం అని అధికారులకు వాహనం డ్రైవర్ చెప్పాడు.

వైసిపి నేతలు రావడంతో ఉద్రిక్తత

వైసిపి నేతలు రావడంతో ఉద్రిక్తత

అయితే, ఈ వాహనాన్ని అక్కడే తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైసిపి నేతలు అక్కడికి తరలివెళ్లారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

డోర్ తెరవగా కూరగాయలు... డబ్బు లేదు

డోర్ తెరవగా కూరగాయలు... డబ్బు లేదు

కంటైనర్ ను తెరిచి తనిఖీ చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వాహనాన్ని పరిశీలించగా అందులో కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నట్టు ఈసీ పరిశీలకులు, పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ వాహనాన్ని వదిలేశారు.

అందుకే అనుమానం

అందుకే అనుమానం

కాగా, ముఖ్యమంత్రి ప్యాంట్రీ వాహనం అని డ్రైవర్ చెబుతున్న వాహనం మీద పోలీసు గవర్నమెంట్ వెహికిల్ అని రాసి ఉంది. మరోవైపు, ఎన్నికల సమయంలో ప్యాంట్రీ వాహనానికి భారీ స్థాయిలో భద్రత కల్పించ తీసుకెళ్లడం అనుమానాలకు తావిచ్చిందని అంటున్నారు.

సిఎం భద్రతకు ముప్పువాటిల్లేలా తప్పుడు ఫిర్యాదని ఐఎస్‌డబ్ల్యు

సిఎం భద్రతకు ముప్పువాటిల్లేలా తప్పుడు ఫిర్యాదని ఐఎస్‌డబ్ల్యు

ముఖ్యమంత్రి భద్రతా వాహనంపై తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఐఎస్‌డబ్ల్యూ ఫిర్యాదు చేసింది. సీఎం చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లేలా తప్పుడు ఫిర్యాదు చేశారని అనుమానించారు., సీఎం భద్రతకు ఆటంకం కలిగేలా ప్రవర్తించినందుకు తీవ్రమైన చర్యగా పరిగణించాలని కోరారు.

కుట్రకోణం తెలుసుకోవాలి

కుట్రకోణం తెలుసుకోవాలి

సీఎం వినియోగించే ఆహార పదార్థాలు పోలీసుల పర్యవేక్షణలో లోడ్ అవుతాయని ఐఎస్‌డబ్ల్యు పేర్కొన్నారు. ఈ తప్పుడు ఫిర్యాదుపై సమగ్ర విచారణతో పాటు, ఏమైనా కుట్ర కోణం ఉందా తెలుసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

English summary
EC stops Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu's pantry vehicle at Gajulapalle metta in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X