AP Election Results: కౌంటింగ్ డేపై అధికారులకు ఈసీ తాజా హెచ్చరికలు..!

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భారీ ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉండే పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చాలా కాలం తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని ముందుగా ఊహించడంలో విఫలమైన అధికారులపై ఇప్పటికే వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు కౌంటింగ్ సందర్బంగా అవి పునరావృతం కాకుండా ఉండేలా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.

ec warns ap election officials on possible violence on election votes counting day

రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పల్నాడుతో పాటు రాయలసీమలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ కు ముందే బలగాల మోహరింపుతో పాటు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా కచ్చితమైన ఫలితాల ప్రకటనకు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో హింస చోటు చేసుకుంటే జిల్లా ఎస్పీలను బాధ్యుల్ని చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతున్న నేపథ్యంలో ఈసీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరింంచుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+